ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్ నాణ్యత విషయంలో రాజీపడొద్దు : అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్ కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ముఖ్యమంత్రి నివాసంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల విద్యార్థులకు అందించే వస్తువులకు సంబంధించి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు కిట్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడొద్దని తెలిపారు. యూనిఫామ్ తో పాటు 21 వస్తువులతో కూడిన కిట్ ను విద్యార్థులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. స్కూల్ బెల్ట్, టై, షూస్, స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర వస్తువులను అందించేందుకు అవసరమైన ప్రొక్యూర్మెంట్ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్, సిఎం సెక్రటరీ వేముల శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Previous Article

మన శంకర వరప్రసాద్ సినిమా ఫై న మదిలో మాట:

Write a Comment

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *