హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
అల్మాస్‌గూడ ప్రధాన రహదారిపై రోడ్డుప్రక్కన నడుచుకుంటూ వెళ్తున్న యాదమ్మ వయసు సుమారు 70 సంవత్సరాల వృద్ధ మహిళకు అకస్మాత్తుగా చైనా మాంజా కాలికి చుట్టుకుంది.
ఈ ఘటనలో ఆమె కాలు తీవ్రంగా కోసుకుపోయి భారీగా రక్తస్రావం జరిగింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వృద్ధురాలిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
నిషేధిత చైనా మాంజా వినియోగం వల్ల ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడుతున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.