మొబైల్ అలవాటు తగ్గించేందుకు స్కూల్ అండ్ ఆఫీస్ ఎక్స్‌పోలో చిత్రలేఖన పోటీలు

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: చిన్నారుల్లో పెరుగుతున్న మొబైల్ ఫోన్ అలవాటును తగ్గిస్తూ వారి సృజనాత్మకతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్వహించిన స్కూల్ అండ్ ఆఫీస్ ఎక్స్‌పోలో విద్యార్థుల కోసం డ్రాయింగ్ మరియు పెయింటింగ్ పోటీలు నిర్వహించారు.

ఎక్స్‌పో గెలాక్సియా వ్యవస్థాపకురాలు మరియు డైరెక్టర్ రాఖీ ముఖర్జీ మాట్లాడుతూ చిన్నారులను చిన్న వయసు నుంచే సృజనాత్మక కార్యకలాపాల వైపు మళ్లించడం అత్యవసరమని తెలిపారు. తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇస్తుండటంతో రెండు, మూడు సంవత్సరాల వయసులోనే “మొబైల్ మానియా” పెరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

“గాడ్జెట్లకు బదులుగా రంగు పెన్సిళ్లు, పెయింట్లు, స్టేషనరీ వస్తువులు పిల్లలకు ఇవ్వాలి. అలా చేస్తే కళలపై ఆసక్తి పెరిగి వారి ప్రతిభ వికసిస్తుంది” అని తల్లిదండ్రులకు ఆమె సూచించారు.

శనివారం జరిగిన ఈ పోటీల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాన్వాస్ పేపర్‌పై రంగులు, పెయింట్లతో ఆకర్షణీయమైన చిత్రాలు వేసి తమ ప్రతిభను ప్రదర్శించారు.

డ్రాయింగ్, పెయింటింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

చిన్నారుల అభివృద్ధిలో కళల ప్రాధాన్యతను తెలియజేయడం, మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు.

Previous Article

సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం – జనవరిలో 37 మంది అరెస్ట్, రూ.65 కోట్ల లావాదేవీలు బట్టబయలు

Next Article

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల ఉక్కుపాదం

Write a Comment

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *