ఈ మధ్య కాలంలో ఒక తెలుగు సినిమా ఫై నా ‘మది’లో మాట!
మన మేఘ స్టార్ చిరంజీవి గారు నటించిన ‘మన శంకర వరప్రసాద్’ మూవీ కోసం చెప్పుకోక తప్పదు.
ఈ సినిమా లో చిరంజీవి గారు 70 వసంతాల “కుర్రాడి ” లా మీకు కనిపిస్తాడు మరి ముఖ్యంగా మీ హృదయం లో నిలిచిపోతాడు.
ఇక సినిమా విషయానికొస్తే, ‘భార్యా-భర్త’ ల మధ్య సాగే స్టోరీ లైన్ చిన్నదే కానీ… ఎక్కడ కూడా మీకు బోరు కొట్టకుండ డైరెక్టర్ సినిమా నడిపించే విధానం, మరియు చిరంజీవి గారి హాస్యంతో కూడుకున్న నటన, ఫైట్స్, మధ్య మధ్య లో పాటలు మరియు గురువుగారి కొత్త కొత్త స్టెప్పులతో డాన్సులు మరి ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ గారి 20 నిముషాల ఎంట్రీ సినిమాలో చాల హైలైట్ గ నిలుస్తుంది.
చిన్న పెద్ద తేడా లేకుండ అందరి మనసుకి నచ్చే 2026 సంక్రాంతి సినిమా అని చెప్పాలి.
ఇట్లు: మీ ఆనందం