Hyderabad: ఘనంగా ‘ARRIVE ALIVE’ రోడ్ సేఫ్టీ ర్యాలీ

హైదరాబాద్‌లోని జలవిహార్ వద్ద ఖైరతాబాద్–సికింద్రాబాద్ ట్రాఫిక్ జోన్ల సంయుక్త ఆధ్వర్యంలో “ARRIVE ALIVE – A Campaign for Road Safety” కార్యక్రమం శనివారం ఉదయం ఘనంగా జరిగింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించి వాహనదారుల్లో భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 300 బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోయెల్ డేవిస్, విశిష్ట అతిథిగా ప్రముఖ సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ్, గౌరవ అతిథిగా అవినాష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జోయెల్ డేవిస్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ISI ప్రమాణాల హెల్మెట్లు ధరించాలని, వెనుక కూర్చునేవారికీ హెల్మెట్ అవసరమేనని స్పష్టం చేశారు. అవినాష్ కుమార్ 18 ఏళ్లలోపు పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించగా, నిఖిల్ సిద్ధార్థ్ రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యతేనని, ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు అధికారులు, NCC విద్యార్థులు, CRT బైక్ రైడర్స్ అసోసియేషన్ సభ్యులు సహా సుమారు వెయ్యి మంది పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

Previous Article

కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

Next Article

Secunderabad Railway Stationలో రైల్వే రక్షణ దళం (RPF) ఆధ్వర్యంలో పేలుడు పదార్థాలు మరియు మత్తుపదార్థాల గుర్తింపు కోసం శుక్రవారం విస్తృత స్థాయి మాక్ డ్రిల్

Write a Comment

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *