Secunderabad Railway Stationలో రైల్వే రక్షణ దళం (RPF) ఆధ్వర్యంలో పేలుడు పదార్థాలు మరియు మత్తుపదార్థాల గుర్తింపు కోసం శుక్రవారం విస్తృత స్థాయి మాక్ డ్రిల్

Secunderabad Railway Stationలో రైల్వే రక్షణ దళం (RPF) ఆధ్వర్యంలో పేలుడు పదార్థాలు మరియు మత్తుపదార్థాల గుర్తింపు కోసం శుక్రవారం విస్తృత స్థాయి మాక్ డ్రిల్ నిర్వహించారు. RPF/సికింద్రాబాద్ పోస్ట్, BDDS/సికింద్రాబాద్ బృందం సంయుక్తంగా, Telangana Police Intelligence Security Wing సహకారంతో ఈ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టింది.

24-01-2026 తేదీన ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని VIP సలోన్ సైడింగ్‌లో ఈ మాక్ డ్రిల్ జరిగింది. RPF/సికింద్రాబాద్ పోస్ట్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బి.ఎస్. సరస్వత్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం సాగింది.

ఈ డ్రిల్‌లో RPF, BDDS అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని IITA అడ్మినిస్ట్రేషన్ & డాగ్ స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మొహమ్మద్ ఇక్బాల్ పర్యవేక్షించగా, IITA హాస్పిటల్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా. ఎ. రాకేష్ సమక్షంలో నిర్వహించారు.

Republic Day 2026ను దృష్టిలో ఉంచుకొని భద్రతా అప్రమత్తతల నేపథ్యంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. శిక్షణలో భాగంగా IITA/మోయినాబాద్ నుంచి 100 మంది డాగ్ హ్యాండ్లర్లు (ఇన్‌స్ట్రక్టర్లతో సహా) మరియు పేలుడు పదార్థాలు–మత్తుపదార్థాల గుర్తింపులో నిపుణులైన 67 శిక్షణ పొందిన కుక్కలు పాల్గొన్నాయి.

VIP సలోన్ సైడింగ్‌లో నిలిపి ఉంచిన ఖాళీ రైలు బోగీల్లో శిక్షణ కోసం డమ్మీ పేలుడు పదార్థాలు, మత్తుపదార్థాలను ఉంచి తనిఖీలు నిర్వహించారు. నిర్దేశిత సమయానికి డాగ్ స్క్వాడ్ వాటిని విజయవంతంగా గుర్తించింది.

తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద లేదా అభ్యంతరకర వస్తువులు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా రైల్వే భద్రత మరింత పటిష్టమవుతుందని తెలిపారు.

Previous Article

Hyderabad: ఘనంగా ‘ARRIVE ALIVE’ రోడ్ సేఫ్టీ ర్యాలీ

Next Article

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కి అంతర్జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Write a Comment

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *