హైదరాబాద్, ఫిబ్రవరి 8:
సైబర్ నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు జనవరి నెలలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆపరేషన్లు నిర్వహించి 7 రాష్ట్రాలకు చెందిన 37 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులతో 26 కీలక కేసులను ఛేదించినట్లు అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ & ఎస్ఐటీ) ఎం. శ్రీనివాసులు వెల్లడించారు.
జనవరి నెలలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మొత్తం 117 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కేసుల విశ్లేషణలో పెట్టుబడి మోసాలు 15, డిజిటల్ అరెస్ట్ 2, సోషల్ మీడియా (CSAM-POCSO) 4, బిజినెస్, గేమింగ్, జాబ్ ఫ్రాడ్స్ 5 కేసులు నమోదయ్యాయి. పోలీసుల వేగవంతమైన చర్యలతో బాధితులకు చెందిన రూ.71.91 లక్షల మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేయగలిగారు.
విచారణలో నిందితులు దేశవ్యాప్తంగా 86 కేసులకు సంబంధం ఉన్నట్లు తేలింది. వారి బ్యాంక్ ఖాతాల్లో సుమారు రూ.65 కోట్ల భారీ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 26 మొబైల్ ఫోన్లు, 79 సిమ్ కార్డులు, 62 డెబిట్ కార్డులు, 57 చెక్కు పుస్తకాలు సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
మ్యాట్రిమోనీ ఇన్వెస్ట్మెంట్ మోసం ఛేదనం:
యూకేలో ఇంజినీర్ నని నమ్మించి మహిళా నిందితురాలు మ్యాట్రిమోనీ సైట్ ద్వారా హైదరాబాద్ వ్యక్తిని నమ్మించి ‘Bakktcoin’ అనే నకిలీ క్రిప్టో ప్లాట్ఫామ్లో పెట్టుబడి పెట్టించింది. బాధితుడు రూ.11.20 లక్షలు కోల్పోయాడు. ఈ కేసులో నిందితులకు సిమ్ కార్డులు సరఫరా చేసిన ఏపీకి చెందిన గెడ్డవలస రవికిరణ్, చోడిపల్లి గంగరాజులను పోలీసులు అరెస్ట్ చేశారు.
జోనల్ సైబర్ సెల్స్ & ‘సి-మిత్ర’ విజయవంతం:
జనవరిలో జోనల్ సైబర్ సెల్స్‌కు 1706 ఫిర్యాదులు అందగా, ‘సి-మిత్ర’ చొరవతో 315 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ విభాగం ద్వారా మరో 13 మందిని అరెస్ట్ చేసి, రూ.10.65 లక్షలు బాధితులకు తిరిగి ఇప్పించారు.
ప్రజలకు పోలీసుల సూచనలు
- అధికారుల పేర్లతో వచ్చే వాట్సాప్/సోషల్ మీడియా మెసేజ్‌లను నమ్మి డబ్బులు పంపవద్దు
- అధిక లాభాలు చూపే పెట్టుబడి స్కీమ్‌లను నమ్మకండి; SEBI గుర్తింపు పొందిన యాప్స్ ద్వారానే పెట్టుబడి పెట్టండి
- అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకండి, APK ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దు
- ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో వచ్చే కాల్స్ మోసం – భయపడి డబ్బులు పంపవద్దు
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
సకాలంలో ఫిర్యాదు చేస్తే డబ్బు ఫ్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు.
సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం – జనవరిలో 37 మంది అరెస్ట్, రూ.65 కోట్ల లావాదేవీలు బట్టబయలు