హైదరాబాద్: ఫిబ్రవరి 24,2026 తన రాబోయే చిత్రం ‘పెద్దీ’ చిత్రీకరణలో బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్ Ram Charan చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ప్రముఖ ఛాయాగ్రాహకుడు రత్నవేలు జన్మదినాన్ని సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం తన సోషల్ మీడియా (X) ఖాతాలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఫ్రేమ్‌ను మాయలాగా మార్చే ఆయన విజన్‌ను కొనియాడారు.
“హ్యాపీ బర్త్‌డే రత్నవేలు గారు. మీతో ఒకే సెట్లో పని చేయడం ఎప్పుడూ గౌరవంగా భావిస్తాను. మీ విజన్ ప్రతి ఫ్రేమ్‌కు మ్యాజిక్ తీసుకువస్తుంది. మీకు అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను” అని రామ్ చరణ్ పోస్టు చేశారు.
చిత్ర బృందం కూడా అధికారిక హ్యాండిల్ ద్వారా రత్నవేలుకు శుభాకాంక్షలు తెలుపుతూ, “అగ్నిలా మెరుస్తున్న ఫ్రేమ్స్ PEDDI సెట్స్ నుండి Megha Power Star బ్లాస్ట్ త్వరలో” అని పేర్కొంది.
దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్దీ’ గ్రామీణ నేపథ్యంలోని భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. ఇటీవల నటుడు జగపతి బాబు పాత్ర ‘Appalasuri’గా పరిచయం కావడం సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది.
గత డిసెంబరు చివరి వారంలో ఢిల్లీలో జరిగిన షెడ్యూల్‌ను చిత్రబృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఆ సందర్భంగా రత్నవేలు తన సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకుంటూ “Immersive, poetic visuals… రామ్ చరణ్ అద్భుతంగా నటించారు” అని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్లో కీలక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ షామ్ కౌశల్ ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫైట్ సీన్ సినిమా హైలైట్‌గా నిలవనుందని సమాచారం. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా రూపొందించిన సెట్స్ చిత్రానికి భారీ స్థాయి తీసుకొచ్చాయి.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, Shivrajkumar, Jagapati Babu,Divyendu Sharma కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘Peedi’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది.