Haleem ప్రియులకి శుభవార్త నగరంలో నేటి నుండి రంజాన్ మాసము ప్రారంభం కావడంతో నగరంలో హలీం అందుబాటులోకి వచ్చింది.

హైదరాబాద్,ఫిబ్రవరి19-2026:హలీమ్ ప్రియులకి శుభవార్త, నగరంలో నేటి నుండి రంజాన్ మాసము ప్రారంభం కావడంతో ముస్లిం సోదరులు ఉపవాసదీక్ష మొదలు కావడంతో నగరం లో హలీం అందుబాటులోకి వచ్చింది, కొన్ని రోజులు ముందుగానే హైదరాబాద్ నగర ప్రజలకోసం హలీం అందుబాటులో ఉన్నప్పటికీ ఈ రోజు నుండి పూర్తీ స్థాయీ లో దొరుకుతుంది.

హైదరాబాద్ చాలా ప్రసిద్ధ రెస్టారెంట్లలో హలీమ్ ప్లేట్ రూ.250 నుండి రూ.300 వరకు ఉండవచ్చు. ఈ రంజాన్ నెలలో హలీమ్ ప్రియులకు హైదరాబాద్ లోని రెస్టారెంట్లు మంచి హలీమ్ అందిస్తాయని ఓల్డ్ సిటీ వాస్తవ్యులు సల్మాన్ అన్నారు.

ముఖ్యముగా హైదరాబాద్ లో కుల మత బేధం లేకుంటే అందరికి నచ్చే వంటకం ఏదయినా ఉందంటే రంజాన్ నెలలో దొరికే వంటకం Haleem (హైదరాబాద్ లో బిర్యానీ తరువాతి స్తానం హలీమ్ అని చెప్పొచ్చు)

హలీమ్ ని హైదరాబాద్ లో వెలుగు లోకి తెచ్చినది పిస్తా హౌస్ యజమాని మజీద్ గారు అని చెప్పొచ్చు

హైదరాబాద్ లో హలీమ్ గత కొన్ని సంవత్సరాలుగా రంజాన్ నెలకు పర్యాయపదంగా మారింది. నెలలో, ఇది ఒక ప్రసిద్ధ వంటకం, అయితే మిగిలిన సంవత్సరంలో ఇది నగరంలోని కొన్ని రెస్టారెంట్లలో మాత్రమే లభిస్తుంది. పిస్తా హౌస్, షా ఘౌస్ రెస్టారెంట్, కేఫ్ 555, బహార్ కేఫ్, సర్వి, మెహ్ఫిల్, మదీనా హోటల్ మరియు షాదాబ్ వంటి అనేక హోటళ్ళు రంజాన్ నెలలో హలీమ్‌ను విక్రయిస్తాయి.

హలీమ్‌ను చికెన్, మటన్ లేదా బీఫ్, నెయ్యి, గోధుమలు, సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ మరియు ఇతర పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. పత్తర్గట్టిలోని మదీనా హోటల్ 1956లో దాని మెనూలో హలీమ్‌ను ప్రవేశపెట్టింది, ఈ రాయల్ డెలికేసీని నగరంలోని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చింది. అప్పటి వరకు, ఇది రాజభవనాలలో వడ్డించే వంటకం.

Previous Article

రంజాన్ మాసం ఆరంభం సందర్భంగాముస్లింసోదరులకిశుభాకాంక్షలుతెలిపినCM A. Revanth రెడ్డిమరియుBRS అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రిK. Chandrashekar Rao

Next Article

కొచ్చిలో "70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్" పుష్పా-2కు ఐదు అవార్డులు.

Write a Comment

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *