Hyderabad “బంజారాహిల్స్ – జూబ్లీహిల్స్” ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు

H-CITI పనులతో ఫిబ్రవరి 27 నుంచి వాహనదారులకు కొత్త మార్గాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 26,2026: నగరంలో కొనసాగుతున్న Hyderabad City Innovative & Transformative Infrastructure (H-CITI) ప్రాజెక్ట్ పనుల నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నెం.2, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, KBR Park మెయిన్ గేట్ మరియు ముగ్ధ జంక్షన్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. ఫిబ్రవరి 27, 2026 నుంచి స్టీల్ ఫ్లైఓవర్ మరియు అండర్‌పాస్ నిర్మాణానికి సంబంధించిన పిల్లర్ పనులు ప్రారంభమవుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఈ పనుల కారణంగా ముగ్ధ జంక్షన్ – KBR Park – Jubilee Hills Check Post మధ్య భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

ప్రత్యామ్నాయ మార్గాలు:
NFCL వైపు నుంచి వచ్చే వాహనాలు శ్రీనగర్ కాలనీ T-Junction, Sagar Society (Mugdha) వద్ద మళ్లింపు తీసుకుని శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్ – ఇందిరానగర్ లేబర్ అడ్డా – జూబ్లీహిల్స్ రోడ్ నెం.5 – వెంకటగిరి ఎక్స్ రోడ్స్ మార్గంలో Jubilee Hills Check Post చేరుకోవచ్చు.

రోడ్ నెం.36 & 45 నుంచి NFCL వైపు వెళ్లేవారు Jubilee Hills Check Post – యూసుఫ్ గూడ – Yousufguda Check Post – Maitrivanam – Ameerpet మీదుగా పంజాగుట్ట మెయిన్ రోడ్ చేరుకోవాలని సూచించారు.

KCP మరియు బంజారాహిల్స్ రోడ్ నెం.1 నుంచి KBR Park వైపు వెళ్లేవారు రోడ్ నెం.10 మీదుగా Cancer Hospital వద్ద ఎడమవైపు తిరిగి Agrasen Island – Bharatiya Vidya Bhavan మార్గం ఉపయోగించాలి. మాసబ్‌ట్యాంక్ నుంచి వచ్చే వాహనాలకు కూడా ఇదే మార్గం సూచించారు.

వాహనదారులకు సూచనలు:
ఉదయం 8:30 నుండి 11:00 వరకు మరియు సాయంత్రం 5:00 నుండి 9:00 వరకు, రద్దీ సమయాల్లో ఈ ప్రాంతాలను వీలైనంతవరకు తప్పించుకోవాలని . ట్రాఫిక్ సైన్‌బోర్డులు, పోలీసుల సూచనలు పాటించాలని, తాజా సమాచారం కోసం Google Maps వంటి నావిగేషన్ యాప్స్ వినియోగించాలని సూచించారు. కార్ పూలింగ్ మరియు ప్రజారవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని, భారీ వాహనాలు రద్దీ సమయాల్లో ప్రవేశించవద్దని తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626ను సంప్రదించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పౌరులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (Traffic), Hyderabad విజ్ఞప్తి చేశారు.

Previous Article

ఉదయపూర్‌లో వైభవంగా “విరోష్” వివాహం – విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దాంపత్య బంధంలోకి

Write a Comment

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *