Sunday, March 22, 2026
HomeCinemaవిజయ్–రష్మిక వివాహం: CM రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి శుభాకాంక్షలు

విజయ్–రష్మిక వివాహం: CM రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి శుభాకాంక్షలు

Hyderabad, March 6,2026: హైదరాబాద్‌లో సినీ నటుడు Vijay Deverakonda నివాసానికి తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy శుక్రవారం వెళ్లి నూతన దంపతులను అభినందించారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ – Rashmika Mandanna జంటను కలిసిన ముఖ్యమంత్రి వారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.Thank you for reading this post, don't forget to subscribe! ఈ సందర్భంగా నూతన దంపతులకు సంతోషకరమైన దాంపత్య జీవితం ఉండాలని, వారి వ్యక్తిగత జీవితంతో పాటు […]

Hyderabad, March 6,2026: హైదరాబాద్‌లో సినీ నటుడు Vijay Deverakonda నివాసానికి తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy శుక్రవారం వెళ్లి నూతన దంపతులను అభినందించారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ – Rashmika Mandanna జంటను కలిసిన ముఖ్యమంత్రి వారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Thank you for reading this post, don't forget to subscribe!

ఈ సందర్భంగా నూతన దంపతులకు సంతోషకరమైన దాంపత్య జీవితం ఉండాలని, వారి వ్యక్తిగత జీవితంతో పాటు సినీ రంగంలో కూడా మరింత ఉన్నత స్థాయికి చేరాలని సీఎం ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

సినీ పరిశ్రమలో విజయ్ దేవరకొండ తన ప్రత్యేక నటనతో యువతలో మంచి గుర్తింపు సంపాదించగా, రష్మిక మందన్న కూడా పలు భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఇటీవల వీరి వివాహం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా వారి నివాసానికి వెళ్లి అభినందించడం విశేషంగా నిలిచింది. నూతన దంపతులకు అభిమానులు, సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related Articles

- Advertisement -

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories