Thursday, May 28, 2026
HomeHyderabadతిరుమలలో స్వామివారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటన

తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటన

LIVE Streaming…     Hyderabad, March 6,2026: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు Kalvakuntla Kavitha శుక్రవారం ఉదయం Tirumala Venkateswara స్వామివారిని దర్శించుకున్నారు. తన భర్త Anil Kumarతో కలిసి ప్రత్యేక దర్శనంలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించారు. గురువారం సాయంత్రం అలిపిరి మెట్లు ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్న కవిత, స్వామివారికి మొక్కు తీర్చుకున్నట్లు తెలిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. దర్శనం […]

LIVE Streaming…  

 

Hyderabad, March 6,2026:

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు Kalvakuntla Kavitha శుక్రవారం ఉదయం Tirumala Venkateswara స్వామివారిని దర్శించుకున్నారు. తన భర్త Anil Kumarతో కలిసి ప్రత్యేక దర్శనంలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించారు.

గురువారం సాయంత్రం అలిపిరి మెట్లు ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్న కవిత, స్వామివారికి మొక్కు తీర్చుకున్నట్లు తెలిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.

దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, గత నాలుగేళ్లుగా తాను ఎదుర్కొన్న మనోవేదనకు స్వామివారి దయతో ముగింపు లభించిందని చెప్పారు. “సత్యం, న్యాయం, ధర్మం మా వైపే ఉన్నాయని నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. ఇప్పుడు స్వామివారి ఆశీస్సులతో పూర్తిగా క్లీన్ చిట్ వచ్చింది. అందుకే కాలినడకన వచ్చి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నాను” అని పేర్కొన్నారు.

ఇక రాజకీయ పరంగా కూడా కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన పని చేసే కొత్త రాజకీయ వేదికను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. “తెలంగాణ ఇంటి పార్టీ”గా ఆ పార్టీ పనిచేస్తుందని, ప్రజల సమస్యలపై బలంగా నిలబడే రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

అదే సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయినా ప్రజల మధ్య సోదర భావం కొనసాగాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు కవిత చెప్పారు. కొత్త రాజకీయ ప్రయాణానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు

Next article

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories