Chowmahalla Palace : హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం నగరంలోని చారిత్రక Chowmahalla Palaceలో ‘దావత్-ఎ-ఇఫ్తార్’ విందును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, ముస్లిం మత పెద్దలు, పీస్ కమిటీల ప్రతినిధులు, పోలీస్ అధికారులు హాజరై రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Thank you for reading this post, don't forget to subscribe!ఈ కార్యక్రమానికి మంత్రులు Ponnam Prabhakar మరియు Mohammad Azharuddin ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే ఎంపీ Asaduddin Owaisi, తెలంగాణ డీజీపీ B. Shivadhar Reddy, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ V. C. Sajjanar, నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ Amit Garg తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో భక్తి, నిబద్ధతతో ప్రార్థనలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ పవిత్ర మాసం సమాజంలో సోదరభావాన్ని మరింత పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ముస్లిం సంస్కృతి ప్రత్యేక గుర్తింపునిచ్చిన హైదరాబాద్ :
హైదరాబాద్ నగరానికి ముస్లిం సంస్కృతి ప్రత్యేక గుర్తింపునిచ్చిందని, ఇక్కడి మత సామరస్యం దేశంలోని ఇతర నగరాలకు ఆదర్శమని కొనియాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల కలయికకు ప్రతీక అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు అన్యోన్యంగా జీవించడం ఈ నగర ప్రత్యేకత అని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకునేందుకు పోలీస్ యంత్రాంగం అందిస్తున్న సహకారం అభినందనీయమని తెలిపారు.
డీజీపీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ పోలీస్ విభాగం ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందు నగరంలోని విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రజల సహకారంతోనే పోలీస్ వ్యవస్థ ప్రజల హృదయాల్లో విశ్వాసాన్ని పొందిందని పేర్కొన్నారు.
సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఓర్పు, క్రమశిక్షణతో పాటు మానవత్వాన్ని పెంపొందించే పవిత్ర కాలమని అన్నారు. హైదరాబాద్ గంగా-జమునా తహజీబ్‌కు నిలయమని పేర్కొంటూ, నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ యంత్రాంగం 24 గంటలూ పనిచేస్తోందని తెలిపారు. ఇటువంటి ఇఫ్తార్ విందులు సమాజం మరియు పోలీసుల మధ్య నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన ఆకాంక్షించారు.
Also Read : రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
