Thursday, March 26, 2026
HomeHyderabadNewsగ్యాస్ కొరత, విదేశీ విద్యా నిధులు, పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై చర్యలు తీసుకోవాలని KTR ప్రభుత్వాన్ని డిమాండ్

గ్యాస్ కొరత, విదేశీ విద్యా నిధులు, పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై చర్యలు తీసుకోవాలని KTR ప్రభుత్వాన్ని డిమాండ్

గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఆందోళన – కేంద్రంపై కేటీఆర్ విమర్శలు హైదరాబాద్: నగరంలోని గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.Thank you for reading this post, don't forget to subscribe! యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, కానీ కేంద్ర ప్రభుత్వం […]

గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఆందోళన – కేంద్రంపై కేటీఆర్ విమర్శలు

హైదరాబాద్: నగరంలోని గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

Thank you for reading this post, don't forget to subscribe!

యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కొరత లేదని ప్రజలను నమ్మబలుకుతోందని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం గ్యాస్ అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

పెట్రోలియం శాఖ కేంద్రం అధీనంలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తప్పించుకుంటోందని కేటీఆర్ విమర్శించారు. భవిష్యత్తులో 14 కిలోల గ్యాస్ సిలిండర్‌ను 10 కిలోలకు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.

సామాన్య ప్రజలు ఈ పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోతున్నారని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తిన విభేదాల వల్ల ప్రజలే బలైపోతున్నారని వ్యాఖ్యానించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని గ్యాస్ కొరత నివారణకు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

విదేశీ విద్యార్థుల ఆవేదన – విడుదల కాని నిధులపై అసెంబ్లీలో కేటీఆర్ ప్రశ్నలు

హైదరాబాద్: విదేశీ విద్యా పథకం కింద చదువుతున్న తెలంగాణ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను బీఆర్ఎస్ నేత కేటీఆర్ అసెంబ్లీలో లేవనెత్తారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలాది దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ‘ఓవర్సీస్ విద్యా నిధి’ ద్వారా సాయం అందించామని తెలిపారు. సుమారు 7,000 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారని గుర్తుచేశారు.

2025 అక్టోబర్‌లో రూ.303 కోట్ల నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఆ నిధులు విడుదల కాలేదని విమర్శించారు. దాదాపు 2,500 మంది విద్యార్థులు నిధుల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.

అమెరికా, లండన్, జర్మనీ వంటి దేశాల్లో చదువుతున్న విద్యార్థులు ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఫస్ట్ సెమిస్టర్ ఫీజులు somehow చెల్లించినా, సెకండ్ సెమిస్టర్ ఫీజుల కోసం ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు తమకు విజ్ఞప్తి చేస్తున్నారని చెప్పారు.

ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వెంటనే నిధులు విడుదల చేయాలని కేటీఆర్ కోరారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగాలపై నిరసనలు – బీఆర్ఎస్ నేతల అరెస్టులపై ఆగ్రహం

హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, ఉద్యోగాల హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్‌వి నేతలు చేపట్టిన నిరసనలపై పోలీసుల చర్యలు వివాదాస్పదంగా మారాయి.

ప్రశ్నించిన నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ విమర్శించింది. బడ్జెట్ సమావేశాల సమయంలోనైనా నిధులు విడుదల చేయాల్సిందిపోయి, నిరసనలను అణచివేయడం ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. నిరుద్యోగులను మోసం చేశారని తీవ్రంగా విమర్శించారు.

ఇక గురుకులాల్లో జరిగిన విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

అదేవిధంగా దివ్యాంగులు కూడా తమ సమస్యలతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని, వారికి ఇచ్చిన పెన్షన్ హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు.

ప్రభుత్వం వెంటనే స్కాలర్‌షిప్‌లు విడుదల చేసి, అరెస్ట్ చేసిన నేతలను విడుదల చేయాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

KTR raises voice on gas shortage, overseas education funds, and pending scholarships, demanding immediate action from the government.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories