మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్ విడుదల
మీడియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్ మరియు టైటిల్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రంలో మురళీ మోహన్, అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ కడియాల ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహించగా, హనుమంత్ రెడ్డి, ఉమా గుత్తూర్‌లు ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించడం విశేషం. ఆయన చేతుల మీదుగా విడుదల కావడంతో చిత్రానికి మంచి హైప్ ఏర్పడింది.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, “ఈ సినిమాను చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురళీ మోహన్ గారిని ఇంత అగ్రెసివ్, ఇంతెన్స్ పాత్రలో నేను ఎప్పుడూ చూడలేదు” అని అన్నారు. అలాగే అనన్య నాగళ్ల నటనను ప్రశంసిస్తూ, దర్శకుడు పవన్ కడియాల సినిమాను వినూత్నంగా, ఆసక్తికరంగా తెరకెక్కించినందుకు అభినందించారు.
చిత్ర యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం, “ది బ్రేకింగ్ న్యూస్” ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా, మీడియా రంగాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందుతోంది. ఈ సినిమాను 2026 మే నెలలో థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
