Thursday, May 28, 2026
HomeHyderabadచంచల్‌గూడ జైల్లో ‘Feel the Jail’ 24 గంటల ఖైదీ అనుభవం

చంచల్‌గూడ జైల్లో ‘Feel the Jail’ 24 గంటల ఖైదీ అనుభవం

24 గంటలు జైలు జీవితం అనుభవించాలా..? చంచల్‌గూడ జైల్లో కొత్త కార్యక్రమం “Feel the Jail” పేరిట వినూత్న ప్రయోగం.. 12 గంటలకు ₹1000, 24 గంటలకు ₹2000 హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలు ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా జైలు జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కల్పిస్తోంది. “ “Feel the Jail” పేరుతో తెలంగాణ జైళ్ల శాఖ ప్రారంభించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, ప్రజలు 12 గంటలు లేదా 24 గంటలు జైలు […]

24 గంటలు జైలు జీవితం అనుభవించాలా..? చంచల్‌గూడ జైల్లో కొత్త కార్యక్రమం

“Feel the Jail” పేరిట వినూత్న ప్రయోగం.. 12 గంటలకు ₹1000, 24 గంటలకు ₹2000

హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలు ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా జైలు జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కల్పిస్తోంది. “

Hyderabad’s Chanchalguda Jail Launches ‘Feel the Jail’ Experience
Hyderabad’s Chanchalguda Jail Launches ‘Feel the Jail’ Experience

“Feel the Jail” పేరుతో తెలంగాణ జైళ్ల శాఖ ప్రారంభించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, ప్రజలు 12 గంటలు లేదా 24 గంటలు జైలు వాతావరణంలో గడపవచ్చు. 12 గంటల అనుభవానికి ₹1000, పూర్తి 24 గంటల అనుభవానికి ₹2000 ఫీజు నిర్ణయించారు.

జైలు బ్యారక్‌లను నిజ జీవిత ఖైదీల నివాసాల మాదిరిగానే రూపొందించారు. సాధారణ పడకలు, తాగునీటి కుండలు, చిన్న వాష్‌రూమ్‌లు, ఇనుప గ్రిల్స్‌తో కూడిన గదులు సందర్శకులకు నిజమైన జైలు అనుభూతిని కలిగించేలా ఏర్పాటు చేశారు. హై సెక్యూరిటీ బ్యారక్‌లలో అయితే మరింత కఠిన నియంత్రణల వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జైలు నిబంధనలకు అనుగుణంగా సమయపాలన, ఆహార విధానం, పరిమిత కదలికలు వంటి అంశాలను కూడా ఈ అనుభవంలో భాగం చేశారు. దీంతో ఖైదీల దైనందిన జీవితం ఎలా ఉంటుందో ప్రజలు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తోంది.

ఈ కార్యక్రమంతో పాటు చంచల్‌గూడ జైలు మ్యూజియంను కూడా ప్రారంభించారు. దేశంలో ఇది ఐదో జైలు మ్యూజియంగా నిలిచింది. మ్యూజియంలో బ్రిటీష్ కాలం నాటి శిక్షా పరికరాలు, ఇనుప సంకెల్లు, పాత జైలు రికార్డులు, ఖైదీలపై అమలైన కఠిన శిక్షలకు సంబంధించిన అరుదైన వస్తువులను ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా ఖైదీల తయారీ ఉత్పత్తులు, జైలు పరిశ్రమలు, నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణంలో ఖైదీల పాత్ర వంటి ప్రత్యేక విభాగాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు ప్రవేశ రుసుము ₹10 కాగా, ఇతరులకు ₹20గా నిర్ణయించారు. 10 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.

తెలంగాణ గవర్నర్ Shiv Pratap Shukla ఈ మ్యూజియంను ప్రారంభిస్తూ, జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలు కాకుండా మార్పు, పునరావాసానికి దోహదపడే సంస్కరణ కేంద్రాలుగా మారాలని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో తాను 19 నెలలు జైలులో గడిపిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ, జైళ్లలో మానవీయ సంస్కరణల అవసరాన్ని వివరించారు.

తెలంగాణ జైళ్ల శాఖ డీజీ Soumya Mishra మాట్లాడుతూ, “Feel the Jail” కార్యక్రమం వినోదం కోసం కాదని, ప్రజల్లో అవగాహన, క్రమశిక్షణ, స్వేచ్ఛ విలువను పెంపొందించేందుకు రూపొందించామని తెలిపారు. ముఖ్యంగా యువత చట్టాలను గౌరవించడం, సమాజంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం ద్వారా అర్థమవుతుందని చెప్పారు. జైళ్లను కేవలం శిక్ష స్థలాలుగా కాకుండా పునరావాస కేంద్రాలుగా సమాజం చూడాలని ఆమె పేర్కొన్నారు.

Hyderabad’s Chanchalguda Jail Launches ‘Feel the Jail’ Experience

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories