Ram Charan వ్యాఖ్యలు: “పెద్ది’ నా కెరీర్‌లో మరో ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ స్థాయి కల్ట్ మూవీ” – ముంబైలో ఘనంగా ట్రైలర్ లాంచ్
మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా విజువల్ స్పెక్టకిల్ ‘పెద్ది’ దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సృష్టిస్తోంది. దర్శకుడు Buchi Babu Sana రూపొందిస్తున్న ఈ గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ట్రైలర్‌ను ముంబైలో అత్యంత వైభవంగా విడుదల చేశారు. ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అద్భుతమైన విజువల్స్, పవర్‌ఫుల్ ఎమోషన్స్, రామ్ చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Venkata Satish Kilaru నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని Mythri Movie Makers మరియు Sukumar Writings సమర్పిస్తున్నాయి. ఇప్పటికే పోస్టర్లు, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై భారీ హైప్ నెలకొంది.
హీరోయిన్ Janhvi Kapoor మాట్లాడుతూ, “ఈ సినిమా కోసం మేమంతా రెండు సంవత్సరాలుగా కష్టపడుతున్నాం. మీ అందరితో కలిసి ట్రైలర్ చూడటం ఎంతో ప్రత్యేకమైన అనుభూతి. బుచ్చిబాబు గారు అసలు రాజీ పడని దర్శకుడు. ఆయన ఊహించిన విజన్ వచ్చే వరకు ఆగరు. A. R. Rahman సంగీతంతో తెరకెక్కుతున్న సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నాను. రామ్ చరణ్‌తో పని చేయడం నా జీవితంలో గొప్ప అవకాశం. మా అమ్మ Sridevi మరియు Chiranjeevi సినిమాలను ప్రేక్షకులు ఎంతో ప్రేమించారు. ఇప్పుడు మా కాంబినేషన్ రావడం చాలా నాస్టాల్జిక్‌గా అనిపిస్తోంది” అని తెలిపారు.
సంగీత దర్శకుడు A. R. Rahman మాట్లాడుతూ, “చాలా తమిళ సినిమాలు చేశాను కానీ నేరుగా ఒక తెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆ అవకాశం ‘పెద్ది’తో వచ్చింది. బుచ్చిబాబు కథ చెప్పినప్పుడు ఆయన కళ్లల్లో కనిపించిన ప్యాషన్ నన్ను వెంటనే ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో శ్రద్ధగా రూపొందించారు. రామ్ చరణ్ ఈ పాత్ర కోసం చేసిన ఫిజికల్, మెంటల్ ఎఫర్ట్ అసాధారణం” అన్నారు.
నిర్మాత Venkata Satish Kilaru భావోద్వేగంతో మాట్లాడుతూ, “గత రెండేళ్లుగా మేమంతా ఎంతో కష్టపడ్డాం. జూన్ 4 తర్వాత ఈ సినిమా ప్రేక్షకులది. రామ్ చరణ్ గారి కమిట్‌మెంట్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గాయాలు అయినా ఆగకుండా పని చేశారు. R Rathnavelu అద్భుతమైన విజువల్స్ అందించారు. A. R. Rahman తన ఆత్మను ఈ సంగీతంలో పెట్టారు. జాన్వీ కపూర్ డెడికేషన్ చూసినప్పుడల్లా శ్రీదేవి గారు గుర్తుకొచ్చారు” అని అన్నారు.
నటుడు Divyenndu Sharma మాట్లాడుతూ, “ఇంత పెద్ద సినిమాలో భాగమవడం చాలా ఆనందంగా ఉంది. బుచ్చిబాబు గారు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. రామ్ చరణ్ లుక్ అద్భుతంగా ఉంది. రహ్మాన్ సంగీతంతో కూడిన సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నాను” అన్నారు.
దర్శకుడు Buchi Babu Sana మాట్లాడుతూ, “నా రెండో సినిమాకే ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ పాత్ర కోసం ఆయన పడిన కష్టం నాకు మాత్రమే తెలుసు. జాన్వీ ఎంతో కష్టపడే నటి. A. R. Rahmanతో పని చేయడం కల నిజమైనట్టే. నిన్న ఫస్ట్ హాఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విన్నాను… మైండ్ బ్లోయింగ్‌గా ఉంది” అన్నారు.
సినిమాటోగ్రాఫర్ R Rathnavelu మాట్లాడుతూ, “పెద్ది ఒక అద్భుతమైన కథ. ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పని చేశారు. రామ్ చరణ్ ఈ పాత్ర కోసం పూర్తిగా మారిపోయారు. ప్రేక్షకులు ఆయన నుంచి నెక్స్ట్ లెవల్ పెర్ఫార్మెన్స్ చూడబోతున్నారు” అన్నారు.
చివరిగా మెగా పవర్ స్టార్ Ram Charan స్టేజ్‌పై మాట్లాడుతూ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. “గత రెండేళ్లుగా మేమంతా ఈ సినిమా కోసం బ్రతికాం. బుచ్చిబాబు మాత్రం ఐదేళ్లుగా ఈ ప్రయాణంలో ఉన్నారు. ఈ సినిమాకు A. R. Rahman గారిని తీసుకొచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి సినిమాకు కొన్ని స్తంభాలు ఉంటాయి… కానీ మా సినిమాకు రహ్మాన్ గారే ప్రధాన స్తంభం.
ఈ పాత్ర కోసం నేను పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ కావాల్సి వచ్చింది. ఇది వ్యక్తిత్వం కోసం జరిగే యూనివర్సల్ సెర్చ్ గురించి చెప్పే నిజాయితీ గల కథ. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు తరచుగా రావు. ‘పెద్ది’ కూడా అలాంటి అరుదైన చిత్రాల్లో ఒకటి. ఈ సినిమాను నా జీవితాంతం నా లైబ్రరీలో భద్రపెట్టుకుంటాను. ప్రేక్షకులు ఎన్నడూ చూడని సర్ప్రైజ్‌కు సిద్ధంగా ఉండండి” అంటూ ముగించారు.
