Thursday, May 28, 2026
HomeEntertainmentఫస్ట్ టైం ప్రీ-రిలీజ్ ఈవెంట్ & సాంగ్ లాంచ్.. ముఖ్య అతిథిగా మెరిసిన స్టార్ హీరోయిన్...

ఫస్ట్ టైం ప్రీ-రిలీజ్ ఈవెంట్ & సాంగ్ లాంచ్.. ముఖ్య అతిథిగా మెరిసిన స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్!

 ‘ఫస్ట్ టైం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ & సాంగ్ లాంచ్.. ముఖ్య అతిథిగా మెరిసిన స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్! హేమంత్ ఇప్పలపల్లి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన వినూత్న చిత్రం ‘ఫస్ట్ టైం’. అత్యంత పరిమిత బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో, భారతదేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక VFX చిత్రంగా ఇది రూపుదిద్దుకుంది. నేడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోలేదు” సాంగ్ లాంచ్ వేడుకలు హైదరాబాద్‌లో అత్యంత […]

 ‘ఫస్ట్ టైం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ & సాంగ్ లాంచ్.. ముఖ్య అతిథిగా మెరిసిన స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్!

హేమంత్ ఇప్పలపల్లి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన వినూత్న చిత్రం ‘ఫస్ట్ టైం’. అత్యంత పరిమిత బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో, భారతదేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక VFX చిత్రంగా ఇది రూపుదిద్దుకుంది. నేడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోలేదు” సాంగ్ లాంచ్ వేడుకలు హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగాయి.

ఈ చిత్రంతో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయమవుతుండగా, ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ పాత్రలో నటిస్తున్నారు. అనిక్క విక్రమన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించగా, వేణు మురళీధర్ మరియు రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకుండా, కేవలం HI (హ్యూమన్ ఇంటెలిజెన్స్) సహాయంతో హై-రేంజ్ గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి, జీ చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ విచ్చేయగా, స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

వేడుకలో ప్రముఖుల మాటల్లో..

  • సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్: “నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు దాటింది. ఒకే వ్యక్తి రాజమౌళి గారిని ఆదర్శంగా తీసుకుని కథ, దర్శకత్వం, నిర్మాణం వంటి ఇన్ని బాధ్యతలు నిర్వహించడం నిజంగా అభినందనీయం. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ కొత్త కుర్రాళ్ల ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలి. మే 22న విడుదలవుతున్న ‘ఫస్ట్ టైం’ చిత్రాన్ని ప్రేక్షకులు పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను.”

  • ముఖ్య అతిథి, నటి పాయల్ రాజ్‌పుత్: “మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. డైరెక్టర్ హేమంత్ ఈ సినిమా కోసం తన సర్వస్వాన్ని పణంగా పెట్టి పనిచేశారు. థియేటర్లలో విడుదలయ్యాక ఈ సినిమాలోని VFX గురించి అందరూ మాట్లాడుకుంటారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. హీరో సౌరబ్ సినిమాను ఒక ప్రతిజ్ఞలా తీసుకుని కష్టపడ్డాడు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.”

  • మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్: “ఒక సినిమాకు రైటింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్, ఎడిటింగ్ అన్నీ ఒక్కరే చేయడం సాధారణ విషయం కాదు. హేమంత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఈ విశ్వాన్ని నడిపించే బ్రహ్మదేవుని కాన్సెప్ట్‌తో, సనాతన ధర్మాన్ని చూపిస్తూ అద్భుతంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కచ్చితంగా థియేటర్లలో చూడదగ్గ సినిమా ఇది.”

  • హీరో సౌరబ్ ధింగ్ర: “మా వెనుక నిలబడి ఈ సినిమాను మార్కెట్ లోకి తీసుకెళ్లిన స్పందన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా డైరెక్టర్ ఫ్యామిలీకి దూరంగా ఉండి రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ప్రతి విషయంలో నాకు అండగా నిలిచిన పాయల్‌కు థాంక్స్. ఇంతకాలం నీ వల్ల నేను గర్వపడ్డాను, ఇకపై నా నటనతో నిన్ను గర్వపడేలా చేస్తా.”

  • దర్శక నిర్మాత హేమంత్ ఇప్పలపల్లి: “ఈ సినిమా ప్రయాణంలో మాకు వెన్నుముకలా నిలిచి, ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి పాయల్. మా ఈవెంట్‌కు వచ్చి సపోర్ట్ చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మే 22న వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ థియేటర్లలోనే చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి.”

  • జీ చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్: “ఈ సినిమా ప్రారంభం నుండి నాకు తెలుసు. కేవలం హీరోల మీదే కాకుండా కంటెంట్ నమ్ముకుని హేమంత్ చేసిన ప్రయత్నమిది. ఇందులో VFX చాలా పెద్ద అసెట్ కానుంది. ఇలాంటి వైవిధ్యమైన సినిమాలను ప్రోత్సహిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి.”

  • నటి గాయత్రి గుప్తా: “సమాజంలో మార్పు తేవాలనే బలమైన వ్యక్తిత్వం ఉన్న దువ్వాడ శ్రీనివాస్ గారు, మాధురి గారు ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. పాయల్ చాలా స్ట్రాంగ్ ఉమెన్. కొత్త తరహా కాన్సెప్ట్‌తో హేమంత్ చేసిన ఈ ప్రయత్నాన్ని మే 22న థియేటర్లలో చూసి సక్సెస్ చేయండి.”

భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో, సనాతన ధర్మానికి ఆధునికతను జోడించి తెరకెక్కిన ‘ఫస్ట్ టైం’ చిత్రం మే 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories