వెలచెర్రీలో ఘనంగా ప్రారంభమైన ‘కలర్స్ 2.0’ వెల్నెస్ సెంటర్.. ప్రారంభించిన హీరోయిన్ Priya Bhavani
చెన్నై నగరంలో ప్రముఖ వెల్నెస్ & హెల్త్‌కేర్ సంస్థ ‘కలర్స్’ తన సేవలను మరింత విస్తరిస్తూ వెలచెర్రీలో అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ‘కలర్స్ 2.0’ వెల్నెస్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సౌతిండియా హీరోయిన్ Priya Bhavani Shankar జ్యోతి ప్రజ్వలన అనంతరం రిబ్బన్ కట్ చేసి సెంటర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
వెలచెర్రీలోని మహేశ్వరీ నగర్, 100 ఫీట్ రోడ్ వద్ద ప్రారంభమైన ఈ ప్రీమియం వెల్నెస్ సెంటర్‌లో ఆధునిక సాంకేతికతతో కూడిన ఆరోగ్య, ఫిట్‌నెస్, డెర్మటాలజీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రియ భవానీ శంకర్, నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమైందని పేర్కొన్నారు. నిజమైన అందం అనేది కేవలం బాహ్య రూపంలో కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానం, సరైన ఆహారపు అలవాట్లు, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడంలో ఉందని తెలిపారు.
బరువు నియంత్రణ, చర్మం మరియు జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారికి ఇలాంటి ప్రత్యేక వెల్నెస్ సెంటర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆమె అన్నారు. చెన్నై ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాల సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.
కలర్స్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన తమ సంస్థ ఇప్పుడు తమిళనాడులో కూడా వేగంగా విస్తరిస్తోందన్నారు. కుంభకోణం తర్వాత చెన్నైలో మరో ప్రీమియం సెంటర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు.
గత 22 ఏళ్లుగా వెల్నెస్ రంగంలో సేవలందిస్తున్న తమ సంస్థ, బరువు నియంత్రణ ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలిగించే ప్రత్యేక ప్రోగ్రామ్‌లను అందిస్తోందన్నారు. ప్రస్తుతం సంస్థలో 250 మందికి పైగా న్యూట్రిషనిస్టులు, వందమంది నిపుణులైన వైద్యులు, 2000 మందికి పైగా శిక్షణ పొందిన టెక్నీషియన్లు సేవలందిస్తున్నారని వెల్లడించారు.
మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య అవసరాలు మారుతున్న నేపథ్యంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ సెంటర్‌ను రూపొందించామని తెలిపారు. చెన్నై ప్రజల జీవనశైలికి అనుగుణంగా ప్రత్యేక వెల్నెస్ ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.
ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ, డెర్మటాలజీ మరియు వెల్నెస్ సేవల్లో ‘కలర్స్’ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఆధునిక సాంకేతికత, నిపుణులైన డెర్మటాలజిస్టులు, అనుభవజ్ఞులైన సిబ్బందితో నాణ్యమైన సేవలను అందించడం తమ లక్ష్యమని తెలిపారు.
5ఎం మీడియా ఆధ్వర్యంలో జైదీప్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వెల్నెస్ రంగ నిపుణులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెలచెర్రీలో ప్రారంభమైన ‘కలర్స్ 2.0’ ద్వారా అత్యాధునిక వెల్నెస్ సేవలు మరింత చేరువ కావడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
