ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పిస్తున్న ‘సతి లీలావతి’ — మే 8, 2026న గ్రాండ్ రిలీజ్
లావణ్య త్రిపాఠి కొనిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సతి లీలావతి’ చిత్రం మే 8, 2026న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో, నాగ మోహన్ (ఎంఎన్ఎంబి) దుర్గా దేవి పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘ఎస్‌ఎంఎస్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు తాటినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని యూ సర్టిఫికేట్ పొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపుదిద్దుకుంది. విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
‘సతి లీలావతి’లో లావణ్య త్రిపాఠి కొనిదెల మరియు దేవ్ మోహన్ దంపతులుగా కనిపించనున్నారు. భార్య ఆధిపత్యం చూపించే కథాంశంతో సాగిన ఈ రొమాంటిక్ రిలేషన్‌షిప్ డ్రామా, సరదాగా, వినోదాత్మకంగా కథను ముందుకు తీసుకెళ్తుంది. భార్యాభర్తల మధ్య జరిగే సంఘర్షణలు, భావోద్వేగాలు, హాస్యంతో మిళితమై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత నాగ మోహన్ మాట్లాడుతూ, “భార్యాభర్తల మధ్య ఉన్న బంధం, సంఘర్షణలను ఎమోషనల్‌గా, అలాగే హాస్యంతో చెప్పాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం,” అన్నారు.
అలాగే, “ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేస్తూ ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేస్తాము,” అని తెలిపారు.
రొమాన్స్, హాస్యం, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన ‘సతి లీలావతి’ ఈ సమ్మర్‌లో ప్రేక్షకులను అలరించే పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది.

