Saturday, June 6, 2026
HomeHyderabadసీతారాంబాగ్‌లో కల్తీ చాక్లెట్ ఫ్యాక్టరీపై H-FAST దాడి.

సీతారాంబాగ్‌లో కల్తీ చాక్లెట్ ఫ్యాక్టరీపై H-FAST దాడి.

హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే మరో కల్తీ ఆహార తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ సిటీ పోలీసుల ప్రత్యేక విభాగం హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం బట్టబయలు చేసింది. హబీబ్‌నగర్ పోలీసులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారుల సంయుక్త చర్యలో భాగంగా సీతారాంబాగ్‌లో నిర్వహించిన మెరుపు దాడుల్లో నకిలీ, గడువు ముగిసిన పదార్థాలతో చాక్లెట్లు తయారు చేస్తున్న కేంద్రాన్ని గుర్తించి భారీ మొత్తంలో నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కొండ కార్తీక్ అనే వ్యక్తిని అరెస్ట్ […]

హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే మరో కల్తీ ఆహార తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ సిటీ పోలీసుల ప్రత్యేక విభాగం హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం బట్టబయలు చేసింది. హబీబ్‌నగర్ పోలీసులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారుల సంయుక్త చర్యలో భాగంగా సీతారాంబాగ్‌లో నిర్వహించిన మెరుపు దాడుల్లో నకిలీ, గడువు ముగిసిన పదార్థాలతో చాక్లెట్లు తయారు చేస్తున్న కేంద్రాన్ని గుర్తించి భారీ మొత్తంలో నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కొండ కార్తీక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్-ఫాస్ట్ సబ్-ఇన్‌స్పెక్టర్లు పి. కృష్ణయ్య, అభిలాష్, వి. శంకర్‌లతో కూడిన బృందం, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సమీనా బేగం మరియు హబీబ్‌నగర్ పోలీసులతో కలిసి ఓల్డ్ మల్లేపల్లిలోని సీతారాంబాగ్ ప్రాంతంలో ఉన్న “విగ్నేట్ ఫుడ్ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్”పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల సందర్భంగా అక్కడ తయారవుతున్న చాక్లెట్ ఉత్పత్తులపై తయారీ తేదీ, గడువు తేదీ, బ్యాచ్ నంబర్, ‘బెస్ట్ బిఫోర్’ వంటి తప్పనిసరి వివరాలు లేకపోవడం గుర్తించారు. అంతేకాకుండా గడువు ముగిసిన ఫ్లేవర్లు, ఎస్సెన్స్‌లు, రంగు పొడులను ఉపయోగిస్తూ చాక్లెట్ల తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. సంస్థకు కొత్త ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ ఉన్నప్పటికీ, పాత లైసెన్స్ నంబర్‌తో ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తేలింది.

దాడుల్లో 200 కిలోల క్యారమెల్ చాక్లెట్, 20 కిలోల చోకో బాల్స్, చాక్లెట్ స్టిక్స్, మార్ష్‌మెలో, జుజుబి ఉత్పత్తులు, క్రాన్‌బెర్రీ, పాన్, జీడిపప్పు చాక్లెట్లు సహా భారీ మొత్తంలో నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నాలుగు ప్యానింగ్ మెషీన్లు, రెండు చాక్లెట్ మెల్టింగ్ మెషీన్లను కూడా జప్తు చేశారు.

బబుల్ గమ్, స్ట్రాబెర్రీ, వెనిలా, ఆరెంజ్, మ్యాంగో, లిచీ, పెప్పర్‌మింట్ తదితర గడువు ముగిసిన ఫ్లేవర్లు, రసాయనాలు కూడా దొరికాయి. సిబ్బందికి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం, పెస్ట్ కంట్రోల్ రికార్డులు నిర్వహించకపోవడం వంటి పలు నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories