Tuesday, June 2, 2026
HomeHyderabad18 కిలోల గంజాయిని పట్టించిన బస్ కండక్టర్ Srikanthకు DCP Rithiraj నగదు ప్రోత్సాహం

18 కిలోల గంజాయిని పట్టించిన బస్ కండక్టర్ Srikanthకు DCP Rithiraj నగదు ప్రోత్సాహం

Hyderabad నగరంలో ప్రజల అప్రమత్తతతో మరో భారీ గంజాయి రవాణా యత్నం భగ్నమైంది. Miyapur Metro Station సమీపంలో సుమారు 18 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోగా, ఈ ఘటనలో కీలక పాత్ర పోషించిన Private Travels బస్ కండక్టర్ Srikanthను Kukatpally DCP Rithiraj నగదు ప్రోత్సాహంతో సత్కరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మే 30, 2026 రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఆరుగురు వ్యక్తులు Aurangabadకు వెళ్తున్నట్లు చెబుతూ Shirdiకి […]

Hyderabad నగరంలో ప్రజల అప్రమత్తతతో మరో భారీ గంజాయి రవాణా యత్నం భగ్నమైంది. Miyapur Metro Station సమీపంలో సుమారు 18 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోగా, ఈ ఘటనలో కీలక పాత్ర పోషించిన Private Travels బస్ కండక్టర్ Srikanthను Kukatpally DCP Rithiraj నగదు ప్రోత్సాహంతో సత్కరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మే 30, 2026 రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఆరుగురు వ్యక్తులు Aurangabadకు వెళ్తున్నట్లు చెబుతూ Shirdiకి వెళ్తున్న ఓ Private Travels బస్సులో ఒక లగేజీ బ్యాగ్‌ను ఎక్కించేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బస్ కండక్టర్ Srikanth ఆ బ్యాగ్‌లో ఏముందని ప్రశ్నించగా, వారు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి పరారయ్యారు.

దీంతో అప్రమత్తమైన Srikanth వెంటనే ఆ లగేజీ బ్యాగ్‌ను Miyapur Police Stationకు తీసుకువెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు పంచుల సమక్షంలో బ్యాగ్‌ను పరిశీలించగా అందులో సుమారు 18 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మార్కెట్ విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

ఈ ఘటనపై Miyapur పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి రవాణాకు పాల్పడిన పరారీలో ఉన్న ఆరుగురు వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

సమాజ భద్రత పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడేందుకు సహకరించిన Srikanthను Kukatpally DCP Rithiraj శాలువాతో సత్కరించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలు కూడా అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆమె సూచించారు.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories