మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి – కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మక చిత్రం #చిరుబాబీ2 / #చిరు158
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం #ChiruBobby2 / #Chiru158 పై ఇప్పటికే ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయానంతరం ఈ హిట్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో గ్రాండ్ స్కేల్‌లో నిర్మిస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇది తొలి తెలుగు చిత్రం కావడం విశేషం.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న ఈ చిత్రం తాజాగా తమిళనాడులోని అందమైన లొకేషన్ పొల్లాచ్చిలో కీలక షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కథకు ఎంతో కీలకమైన హై-ఎనర్జీ సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్ర యూనిట్ రూపొందించిన ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు థియేటర్లలో ప్రత్యేక అనుభూతిని అందించనున్నాయని సమాచారం. తదుపరి షెడ్యూల్‌ను త్వరలో ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రాన్ని భారీ కాన్వాస్‌పై, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్, ఇంటెన్స్, మాస్ అప్పీల్ కలిగిన పాత్రలో కనిపించనున్నారని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ పాత్ర కోసం చిరంజీవి మరోసారి ఆకట్టుకునే ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో సిద్ధమయ్యారు.
ఈ మెగా ప్రాజెక్ట్‌కు ఇండస్ట్రీలోని అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సంగీత సంచలనం ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ తన అద్భుతమైన విజువల్స్‌తో చిత్రానికి ప్రత్యేక ఆకర్షణను తీసుకురానున్నారు. అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఆంటోని ఎల్. రూబెన్ ఎడిటింగ్‌ను చేపట్టారు.
స్క్రీన్‌ప్లేను కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అదనపు స్క్రీన్‌ప్లే రచయితలుగా వ్యవహరిస్తున్నారు. భాను–నందు ద్వయం సంభాషణలను అందిస్తున్నారు.
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న #చిరుబాబీ2 / #చిరు158 తెలుగు సినీ ప్రేక్షకులకు మరో మెగాస్టార్ మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలవనుందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తోంది.
