Saturday, June 6, 2026
HomeProfilesసింగ్ గీతం’లో నా పాత్ర చాలా యూనిక్.. ఇలాంటి సినిమా ఇండియాలో ఇప్పటివరకు రాలేదు –...

సింగ్ గీతం’లో నా పాత్ర చాలా యూనిక్.. ఇలాంటి సినిమా ఇండియాలో ఇప్పటివరకు రాలేదు – అహల్యా బమ్రూ

“‘సింగ్ గీతం’లో నా పాత్ర చాలా యూనిక్.. ఇలాంటి సినిమా ఇండియాలో ఇప్పటివరకు రాలేదు” – అహల్యా బమ్రూ లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘సింగ్ గీతం’. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి కీలక పాత్రలు పోషించారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకుల […]

“‘సింగ్ గీతం’లో నా పాత్ర చాలా యూనిక్.. ఇలాంటి సినిమా ఇండియాలో ఇప్పటివరకు రాలేదు” – అహల్యా బమ్రూ

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘సింగ్ గీతం’. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి కీలక పాత్రలు పోషించారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం గురించి హీరోయిన్ అహల్యా బమ్రూ మీడియాతో ముచ్చటించారు.

మీ నేపథ్యం గురించి చెప్పండి?

మాది పుదుచ్చేరి. ఇంగ్లీష్, ఫ్రెంచ్, బెంగాలీ భాషలు మాట్లాడే ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పెరిగాను. నిజానికి నేను ఎప్పుడూ నటిని కావాలని అనుకోలేదు. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌గా పని చేసేదాన్ని. నా ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ చూసిన నాగ్ అశ్విన్ గారు ఈ సినిమా గురించి సంప్రదించారు. ఆడిషన్ కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఇచ్చాను.

ఈ సినిమా సంగీతం నేపథ్యంలో సాగుతుంది. నాకు పాటలు పాడటం, గిటార్ వాయించడం అంటే చాలా ఇష్టం. అందుకే ఇది తెలుగులో నాకు మంచి ప్రారంభం అవుతుందని భావించాను. సింగీతం గారి దర్శకత్వం, నాగ్ అశ్విన్ గారి నిర్మాణం, వైజయంతి మూవీస్ బ్యానర్ అనగానే ఎలాంటి సందేహం లేకుండా ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాను.

సింగీతం శ్రీనివాసరావు గారితో పని చేసిన అనుభవం?

ఆయనతో పని చేయడం నిజంగా గొప్ప అదృష్టం. సింగీతం గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అద్భుతంగా ఉంటుంది. ఆయన తీసిన ఎన్నో చిత్రాలు తమ కాలానికి ముందున్నవిగా నిలిచాయి. ‘సింగ్ గీతం’ కూడా అలాంటి చిత్రమే. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించని కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. 94 ఏళ్ల వయసులో కూడా ఇంత మోడ్రన్ ఆలోచనతో సినిమా చేయడం ఆయనకే సాధ్యం.

తెలుగు సినిమా సెట్స్‌లో మొదటి రోజు ఎలా అనిపించింది?

మొదటి రోజు చాలా టెన్షన్‌గా అనిపించింది. ఎందుకంటే నాకు తెలుగు రాదు. కానీ యూనిట్ మొత్తం కుటుంబంలా కలిసిపోయింది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఆన్‌లైన్ ద్వారా తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడు కొంతవరకు తెలుగు మాట్లాడగలుగుతున్నాను.

సినిమాలో మీ పాత్ర గురించి?

సింగీతం గారు పాత్రలను ఎంతో బలంగా రాస్తారు. ముఖ్యంగా మహిళా పాత్రలకు ఆయన సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ‘సింగ్ గీతం’లో నా పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదు. తన లక్ష్యాలు, అభిప్రాయాలపై స్పష్టత ఉన్న, బలమైన వ్యక్తిత్వం కలిగిన యువతిగా కనిపిస్తాను.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో విలన్ పాత్రను కూడా ఓ అమ్మాయే పోషిస్తోంది. ఇది చాలా అరుదుగా కనిపించే అంశం. కథలో ప్రతి పాత్రకు ప్రత్యేకత ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కథ ఇది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి?

ఇప్పటికే విడుదలైన ‘ఏమైంది ఏమైంది’, ‘హలో బాసు’ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ చిత్రానికి చాలా ప్రత్యేకమైన సంగీతాన్ని అందించారు. ఆయన జీనియస్ కంపోజర్. ఈ సినిమాలో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి.

My Character In Sing Geetham Is Truly Unique – Ahalya Bamroo,
Ahalya Bamroo

సినిమా గురించి ఒక్క మాటలో?

ఇది పూర్తిగా కొత్త జానర్‌లో రూపొందిన సినిమా. ఇలాంటి కథ, కథనం ప్రేక్షకులు ఇంతకుముందు చూడలేదు. జూన్ 11న థియేటర్లలో తప్పకుండా చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా.

నాగ్ అశ్విన్ గారి సపోర్ట్ ఎలా ఉంది?

నాగ్ అశ్విన్ గారి ఇన్‌వాల్వ్‌మెంట్ ఈ ప్రాజెక్ట్‌లో చాలా కీలకం. ఆయన సింగీతం గారి అభిమానిగా మాత్రమే కాకుండా, సినిమా పట్ల అపారమైన ప్యాషన్ ఉన్న వ్యక్తి. ప్రతి నటుడితో మాట్లాడి విలువైన సూచనలు ఇచ్చేవారు. దర్శకత్వం పూర్తిగా సింగీతం గారిదే అయినప్పటికీ, సినిమా అత్యుత్తమంగా రావడానికి అవసరమైన ప్రతి అంశాన్ని నాగ్ అశ్విన్ గారు పర్యవేక్షించారు.

నిర్మాతల గురించి?

వైజయంతి మూవీస్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రియాంక గారు, స్వప్న గారు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. కొత్త తరహా కథలను ప్రేక్షకులకు అందించాలనే వారి ఆలోచన ఈ చిత్రంలో కూడా కనిపిస్తుంది.

గతంలో చేసిన సినిమాలు?

బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు షూజిత్ సిర్కార్ దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్‌తో ఒక సినిమా చేశాను. ‘సింగ్ గీతం’ నా రెండో సినిమా. తెలుగులో మాత్రం ఇదే నా తొలి చిత్రం.

తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మీ అభిప్రాయం?

నాకు సౌత్ ఇండియా అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతో ప్రేమిస్తారు. అలాంటి ప్రేక్షకుల కోసం పని చేయడం చాలా ఆనందంగా ఉంది.

మీ డ్రీమ్ రోల్?

నాకు యాక్షన్ సినిమాలు చేయడం చాలా ఇష్టం. భవిష్యత్తులో యాక్షన్ ప్రధానమైన పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను.

మీకు ఇష్టమైన తెలుగు హీరో?

మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఆయన అద్భుతమైన నటుడు.

ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు?

ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories