‘నాగబంధం’ 3డీ స్టాండీ కర్టెన్ రైజర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు అభిషేక్ నామా, హీరో విరాట్ కర్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం ప్రతి అప్డేట్‌తో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
భారతీయ పురాణాలు, ప్రాచీన రహస్యాలు, దైవిక శక్తులు, మిస్టికల్ ప్రపంచాలు, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించనుంది.
ఎన్‌ఐకే స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తోంది. అత్యున్నత నిర్మాణ విలువలు, ఆధునిక సాంకేతికతతో ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ‘నాగబంధం’ 3డీ స్టాండీ కర్టెన్ రైజర్ ఈవెంట్‌ను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. హీరో విరాట్ కర్ణ, హీరోయిన్ నభా నటేష్, నిర్మాతలు పాల్గొని ప్రత్యేకంగా రూపొందించిన 3డీ స్టాండీని ఆవిష్కరించారు. అభిమానుల భారీ స్పందనతో ఈ కార్యక్రమం సందడి వాతావరణంలో జరిగింది.
ప్రాచీన దేవాలయాలు, భారీ యుద్ధ ఘట్టాలు, దైవిక శక్తులతో కూడిన విజువల్ సీక్వెన్స్‌లను అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరపై ఆవిష్కరించేందుకు చిత్ర బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రతి ఫ్రేమ్‌ను ప్రపంచ స్థాయి విజువల్ అనుభూతిని అందించేలా తీర్చిదిద్దుతున్నారు.
ఇండస్ట్రీ వర్గాలు ఇప్పటికే ‘నాగబంధం’ను భారతీయ సినిమా నుంచి రాబోతున్న అతిపెద్ద విజువల్ స్పెక్టకల్స్‌లో ఒకటిగా అభివర్ణిస్తున్నాయి.
నార్త్ ఇండియాలో అన్ని భాషల థియేట్రికల్ రిలీజ్ హక్కులను ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సొంతం చేసుకుంది. దీంతో హిందీ మార్కెట్‌లో ఈ చిత్రానికి భారీ స్థాయిలో విడుదల దక్కనుంది.
అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకోవడం ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.
నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, రిషబ్ సావ్నే తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం మైథలాజికల్ అడ్వెంచర్ జానర్‌కు కొత్త నిర్వచనం ఇవ్వనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠభరిత యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ మ్యూజిక్, ఆసక్తికరమైన కథాంశంతో ‘నాగబంధం’ 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
