‘హెల్లల్లల్లో’తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రామ్ చరణ్ – శృతిహాసన్ మ్యాజిక్!
మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ తెలుగు సినీ చరిత్రలో 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా రికార్డు సృష్టించి సంచలనం రేపింది.
ఈ భారీ హైప్‌కు మరింత ఊపిరి పోస్తూ తాజాగా చిత్రబృందం స్పెషల్ సాంగ్ ‘హెల్లల్లల్లో’ ప్రోమోను విడుదల చేసింది. రిలీజ్ అయిన క్షణాల్లోనే ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా Ram Charan మరియు Shruti Haasan మధ్య కనిపిస్తున్న అద్భుతమైన కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ‘ఎవడు’ తర్వాత ఈ జంట మరోసారి స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని ఇస్తోంది.
ఇక ఈ పాటలో కథానాయిక Janhvi Kapoor కూడా ప్రత్యేక ఆకర్షణగా కనిపించనుంది. ముగ్గురు స్టార్‌ల ఎనర్జీకి తోడు సంగీత మాంత్రికుడు A. R. Rahman అందించిన బీట్‌లు ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా పాటలోని హుక్ స్టెప్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, రీల్స్ ప్రపంచాన్ని షేక్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
మే 23న భోపాల్‌లో ఈ పాటను గ్రాండ్‌గా లాంచ్ చేయనుండగా, ఆ వేడుకలో A. R. Rahman లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో ఈ ఈవెంట్‌పై కూడా భారీ ఆసక్తి నెలకొంది.
దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రాన్ని భావోద్వేగాలు, స్పోర్ట్స్ డ్రామా మరియు మాస్ ఎలిమెంట్స్ సమ్మేళనంగా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. ముఖ్యంగా Ram Charan ఈ సినిమాకోసం చూపించిన డెడికేషన్ విశేషం. క్రికెటర్ పాత్ర కోసం లీన్ లుక్‌లో కనిపించిన ఆయన, రెజ్లర్ మరియు రన్నర్ పాత్రల కోసం భారీ మేకోవర్‌తో బలమైన ఫిజిక్‌ను సిద్ధం చేసుకున్నారు.
భారీ నిర్మాణ విలువలతో నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి Buchi Babu Sana దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
