101 మిలియన్+ వ్యూస్‌తో హిస్టరీ క్రియేట్ చేసిన రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ ట్రైలర్ విడుదలైన క్షణం నుంచే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అద్భుతమైన రెస్పాన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ట్రైలర్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన తొలి 24 గంటల్లోనే ఈ ట్రైలర్ హిస్టారికల్ 101 మిలియన్+ వ్యూస్ సాధించి, అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న తెలుగు ట్రైలర్‌గా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ప్రస్తుతం పలు భాషల్లో యూట్యూబ్‌లో ఇండియా వైడ్ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఈ భారీ రికార్డులతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ‘పెద్ది’ పైనే నిలిచింది. ట్రైలర్‌కు వచ్చిన అపూర్వ స్పందన సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచింది. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు దీన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంటుండగా, హిందీతో పాటు ఇతర భాషల సినీ మీడియా కూడా ఇటీవలి కాలంలో వచ్చిన అత్యంత గ్రిప్పింగ్, ఎమోషనల్ మరియు టెక్నికల్‌గా స్ట్రాంగ్ ట్రైలర్లలో ఇదొకటిగా ప్రశంసలు కురిపిస్తోంది.
ఈ ట్రైలర్‌లో ప్రేక్షకులను అత్యంత ఆశ్చర్యపరిచిన అంశం రామ్ చరణ్ చేసిన అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్. క్రికెట్ ఎపిసోడ్స్‌లో స్లిమ్, అథ్లెటిక్ లుక్‌లో కనిపించిన ఆయన.. కుస్తీ సన్నివేశాల్లో మాత్రం పూర్తి స్థాయి ప్రొఫెషనల్ రెజ్లర్‌లా పవర్‌ఫుల్‌గా కనిపించారు. అంతేకాదు రన్నర్‌గా, పలు క్రీడల్లో పాల్గొనే స్పోర్ట్స్‌మ్యాన్‌గా ఆయన పాత్రను చూపించడం విశేషం. దీంతో ఈ పాత్ర కేవలం హీరో ఎలివేషన్‌కు పరిమితం కాకుండా ఎమోషన్, స్ట్రగుల్, ప్యాషన్, ఇంటెన్సిటీతో నిండిన బలమైన పాత్రగా నిలిచింది.
దర్శకుడు బుచ్చిబాబు సానా ‘పెద్ది’ ప్రపంచాన్ని అత్యంత డీటెయిల్‌గా, సహజత్వంతో రూపొందించారు. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా, స్టార్ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, ఎడిటర్ నవీన్ నూలి తమ అత్యుత్తమ ప్రతిభను ఈ చిత్రానికి అందించారు. నిర్మాత వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీపడకుండా భారీ స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైలర్‌లో కనిపించిన విజువల్స్, మేకింగ్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ హైప్ తీసుకురాగా.. ఇప్పుడు ట్రైలర్ ఆ అంచనాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం దేశమంతా ‘పెద్ది’ గురించే మాట్లాడుతుండటం ట్రైలర్ క్రియేట్ చేసిన యుఫోరియాకి నిదర్శనం.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రానుండగా.. ‘పెద్ది’ భారతీయ సినీ పరిశ్రమలో మరో భారీ సంచలనంగా నిలవబోతుందనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
