Tuesday, July 28, 2026
HomeCinemaఎస్.వి. కృష్ణారెడ్డి చేతుల మీదుగా ‘హ్రీమ్’ టీజర్ విడుదల

ఎస్.వి. కృష్ణారెడ్డి చేతుల మీదుగా ‘హ్రీమ్’ టీజర్ విడుదల

ఎస్.వి. కృష్ణారెడ్డి చేతుల మీదుగా ‘హ్రీమ్’ టీజర్ విడుదల పవన్ టాటా, చామిందా వర్మ జంటగా నటిస్తున్న హారర్-మిస్టికల్ థ్రిల్లర్ ‘హ్రీమ్’ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి హైదరాబాద్‌లో విడుదల చేశారు. సుజాత మల్లాల సమర్పణలో శివ మల్లాల నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ రావూరి దర్శకత్వం వహిస్తున్నారు. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్ లాంచ్ సందర్భంగా అచ్చిరెడ్డి మాట్లాడుతూ, “హ్రీమ్ […]

ఎస్.వి. కృష్ణారెడ్డి చేతుల మీదుగా ‘హ్రీమ్’ టీజర్ విడుదల

పవన్ టాటా, చామిందా వర్మ జంటగా నటిస్తున్న హారర్-మిస్టికల్ థ్రిల్లర్ ‘హ్రీమ్’ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి హైదరాబాద్‌లో విడుదల చేశారు. సుజాత మల్లాల సమర్పణలో శివ మల్లాల నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ రావూరి దర్శకత్వం వహిస్తున్నారు. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

టీజర్ లాంచ్ సందర్భంగా అచ్చిరెడ్డి మాట్లాడుతూ, “హ్రీమ్ టీజర్ చాలా బాగుంది. నిర్మాత శివ మల్లాల గారి ప్యాషన్ ఇందులో కనిపిస్తోంది. ఆయన మంచి పేరు తెచ్చుకుని మరిన్ని పెద్ద సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. హీరోయిన్ చామిందా వర్మకు ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకురావాలి. హీరో పవన్‌కు కూడా ఆల్ ది బెస్ట్. రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి వంటి అనుభవజ్ఞులైన నటులు ఈ చిత్రంలో ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు అలరిస్తారు. దర్శకుడు రాజేష్ రావూరి ఈ సినిమాతో విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ, “శివ మల్లాల మంచి సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. టీజర్ చాలా ఆకట్టుకుంది. టైటిల్ హ్రీమ్ అయినా, ఇది క్రీమ్‌లా అనిపిస్తోంది. చామిందా వర్మ చాలా బాగా నటించింది. రాజీవ్ కనకాల, బెనర్జీ, తనికెళ్ల భరణి వంటి అద్భుతమైన నటీనటులు ఉన్నారు. సినిమా విడుదలైన తర్వాత ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ, నిర్మాత శివ మల్లాలపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, ఈ సినిమా ఆయనకు మరిన్ని చిత్రాలు నిర్మించే అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు.

వీఎఫ్‌ఎక్స్ సూపర్వైజర్ రాజ్ పవన్ మాట్లాడుతూ, “వీఎఫ్‌ఎక్స్ కోసం ఈ చిత్రంలో చేరాను. కానీ చివరికి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ బాధ్యతలను శివ గారు నాపై ఉంచారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టానని భావిస్తున్నాను” అన్నారు.

సంగీత దర్శకుడు మార్కస్ మాట్లాడుతూ, “సినిమా జానర్‌కు తగ్గట్టుగానే సంగీతాన్ని రూపొందించాం. శివ గారు నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చారు. హ్రీమ్ సంగీతం అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను” అన్నారు.

నటుడు రాజశేఖర్ (సుభోదయం సుబ్బారావు) మాట్లాడుతూ, ఈ సినిమాలో తనకు లభించిన పాత్ర మరోసారి మంచి గుర్తింపు తీసుకొస్తుందని చెప్పారు.

దర్శకుడు వరుణ్ రెడ్డి మాట్లాడుతూ, “శివ మల్లాల సినిమాకు సంబంధించిన ప్రతి విభాగంపై అవగాహన ఉన్న వ్యక్తి. హ్రీమ్ చిత్ర బృందం ఎంతో ప్రతిభతో పని చేసింది. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు రాజేష్ రావూరి మాట్లాడుతూ, “కొత్త దర్శకుడినైనా సీనియర్ నటీనటులంతా ఎంతో సహకరించారు. నిర్మాత శివ మల్లాల గారు అవకాశం ఇవ్వకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. హీరో పవన్, హీరోయిన్ చామిందా అద్భుతంగా నటించారు. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు బెనర్జీ మాట్లాడుతూ, “శివ నా మంచి స్నేహితుడు. సినిమా షూటింగ్ ఎంతో ఆనందంగా సాగింది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, నిర్మాత కలిసి మంచి సమన్వయంతో చిత్రాన్ని రూపొందించారు. సినిమా విజయవంతమవుతుందని నమ్ముతున్నాను” అన్నారు.

నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ, “ఈ సినిమా కోసం శివ ఏ మంత్రం నేర్చుకున్నారో తెలియదు కానీ తనకు కావాల్సిన వారందరినీ ఒకచోట చేర్చగలిగారు. నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. సినిమాలోని మిస్టికల్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పవన్, చామిందా తమ పాత్రలను చాలెంజ్‌గా తీసుకుని అద్భుతంగా నటించారు. సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది” అన్నారు.

హీరోయిన్ చామిందా వర్మ మాట్లాడుతూ, “హ్రీమ్ ద్వారా నన్ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన శివ గారికి కృతజ్ఞతలు. టీజర్ చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయి. మా డీఓపీ, మ్యూజిక్ డైరెక్టర్, వీఎఫ్‌ఎక్స్ టీమ్ ఈ సినిమాకు వెన్నెముకలా నిలిచారు. ఇది చాలా విభిన్నమైన కాన్సెప్ట్ మూవీ. ప్రేక్షకులు ఇలాంటి కొత్త తరహా చిత్రాలను ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో పవన్ టాటా మాట్లాడుతూ, “శివ గారు నన్ను కొడుకులా చూసుకున్నారు. దర్శకుడు రాజేష్ నా షార్ట్ ఫిల్మ్స్ చూసి ఈ కథ చెప్పాడు. ఇందులో ప్రేమ, భావోద్వేగాలు, నటనకు మంచి అవకాశం ఉంది. సీనియర్ నటులతో కలిసి పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. మా టెక్నికల్ టీమ్ అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చింది. హ్రీమ్ తప్పకుండా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది” అన్నారు.

నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ, “దాదాపు 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్న నేను ఇప్పుడు నిర్మాతగా మీ ముందుకు వచ్చాను. అవకాశాలు నా దగ్గరకు రాలేదు, నేనే వాటి కోసం వెతికాను. దర్శకుడు రాజేష్ చెప్పిన కథలోని ప్రధాన అంశం నన్ను బాగా ఆకట్టుకుంది. చిన్న డెమో వీడియో చూసిన తర్వాత ఈ సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నాను. రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రం వంటి నటుల సహకారంతో తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన సినిమా రూపొందించగలిగాం. చామిందా వర్మ దుబాయ్ నుంచి వచ్చి రెమ్యునరేషన్ ఆశించకుండా అంకితభావంతో పనిచేశారు. పవన్ కూడా ఎంతో కష్టపడ్డాడు. హ్రీమ్ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.

హారర్, మిస్టరీ, మిస్టికల్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ‘హ్రీమ్’ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories