Friday, April 17, 2026
HomeCinemaPochamma: కథ విన్నప్పుడే "పోచమ్మ" సక్సెస్ ఖాయం అనుకున్నాం – ఆహా కంటెంట్ హెడ్ కవిత

Pochamma: కథ విన్నప్పుడే “పోచమ్మ” సక్సెస్ ఖాయం అనుకున్నాం – ఆహా కంటెంట్ హెడ్ కవిత

Pochamma: కథ విన్నప్పుడే “పోచమ్మ” సక్సెస్ ఖాయం అనుకున్నాం – ఆహా కంటెంట్ హెడ్ కవిత ప్రఖ్యాత తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ “పోచమ్మ”ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 17వ తేదీ నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గోల్డ్ సబ్‌స్క్రైబర్స్‌కు 24 గంటల ముందుగానే యాక్సెస్ లభిస్తుంది. ఈ సిరీస్‌లో అంబటి అర్జున్, రమేశ్ ఇందిర, ప్రియా శతమర్షన్, […]

Pochamma: కథ విన్నప్పుడే “పోచమ్మ” సక్సెస్ ఖాయం అనుకున్నాం – ఆహా కంటెంట్ హెడ్ కవిత

ప్రఖ్యాత తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ “పోచమ్మ”ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 17వ తేదీ నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గోల్డ్ సబ్‌స్క్రైబర్స్‌కు 24 గంటల ముందుగానే యాక్సెస్ లభిస్తుంది.

ఈ సిరీస్‌లో అంబటి అర్జున్, రమేశ్ ఇందిర, ప్రియా శతమర్షన్, స్నేహల్ కామత్, శృతి నాయుడు, శ్రీ పూజ కీలక పాత్రల్లో నటించారు. శృతి నాయుడు చిత్ర బ్యానర్‌పై ఈ సిరీస్‌ను నిర్మించగా, దర్శకత్వం రమేశ్ ఇందిర వహించారు. తాజాగా “పోచమ్మ” వెబ్ సిరీస్ ప్రత్యేక ప్రీమియర్ అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నటి స్నేహల్ కామత్ మాట్లాడుతూ, “ఈ సిరీస్‌లో నేను జెస్సీ పాత్రలో నటించాను. షూటింగ్ మొత్తం చిక్‌మంగళూరులో జరిగింది. నన్ను ఈ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేసిన ప్రొడ్యూసర్ శృతి నాయుడుకు ధన్యవాదాలు. దర్శకుడు రమేశ్ ఇందిర ఒక మంచి దర్శకుడే కాదు, గొప్ప కో-స్టార్ కూడా. మా టీమ్‌తో కలిసి పని చేయడం మర్చిపోలేని అనుభవం,” అని తెలిపారు.

నటి శ్రీ పూజ మాట్లాడుతూ, “ఈ సిరీస్‌లో నటించడం ప్రారంభించిన మొదటి రోజే ఇది సక్సెస్ అవుతుందని నమ్మకం కలిగింది. ఎందుకంటే మా టీమ్‌లో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారు. పని పట్ల అంకితభావం ఉన్నచోట విజయం తప్పదు. ఈ నెల 17 నుంచి ఈ సిరీస్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది,” అని చెప్పారు.

ఆహా కంటెంట్ హెడ్ కవిత మాట్లాడుతూ, “’పోచమ్మ’ కథ విన్నప్పుడే ఈ సిరీస్ సక్సెస్ అవుతుందని మేము నమ్మాం. చిత్రీకరణ సమయంలో పోచమ్మ తల్లి ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉన్నట్టే అనిపించింది. షూటింగ్ సమయంలో ఎక్కడికెళ్లినా పోచమ్మ ఆలయాలు, విగ్రహాలు కనిపించేవి. మా టీమ్ కలిసి ఎంతో డెడికేషన్‌తో పని చేసింది. మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ సిరీస్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది,” అని అన్నారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ, “ఈ ఏడాది ఆహా నుంచి చిరంజీవి, త్రీ రోజెస్ సీజన్ 2, దూల్‌పేట పోలీస్ స్టేషన్, సర్కార్, చెఫ్ మంత్ర వంటి విభిన్నమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నాం,” అని తెలిపారు.

నటుడు అంబటి అర్జున్ మాట్లాడుతూ, “కొన్ని కంటెంట్‌లు విడుదలకు ముందు నిశ్శబ్దంగా ఉంటాయి, కానీ రిలీజ్ అయిన తర్వాత పెద్ద సెన్సేషన్ సృష్టిస్తాయి. ‘పోచమ్మ’ కూడా అలాంటి సిరీస్. పోస్టర్, టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించాం. మా డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్ ఈ సిరీస్‌కు నిజమైన హీరోలు. ప్రతి ఆర్టిస్ట్ అద్భుతంగా నటించారు. చిన్నపిల్లలు కూడా గొప్పగా నటించారు. ఇలాంటి మంచి కంటెంట్‌కు హడావిడి అవసరం లేదు – స్ట్రీమింగ్ అయిన వెంటనే సక్సెస్ అవుతుంది,” అని అన్నారు.

ఈ నెల 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న “పోచమ్మ” వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories