‘నాగబంధం’పై భారీ అంచనాలు.. జీ స్టూడియోస్ చేతికి హిందీ రైట్స్
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం Nagabandham: The Secret Treasure పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు Abhishek Nama, హీరో Virat Karrna కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం ప్రతి అప్డేట్‌తో దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. భారతీయ పురాణాలు, మిస్టరీలు, దైవిక శక్తులు, హై-వోల్టేజ్ యాక్షన్ అంశాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు విజువల్ వండర్‌గా నిలవనుంది.
ఎన్‌ఐకే స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తోంది. భారీ నిర్మాణ విలువలు, అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
తాజాగా విడుదలైన విరాట్ కర్ణ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. వర్షం, చీకటి, అగ్నిజ్వాలల నడుమ కత్తి పట్టుకుని కనిపించిన విరాట్ కర్ణ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆయన చేతిపై పడగ విప్పిన విషసర్పం, నేపథ్యంలో కనిపించే సముద్ర యుద్ధాలు, ట్రైబల్ ఫైట్స్, అగ్నిజ్వాలలు చిత్రంలోని యాక్షన్ స్కేల్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. పోస్టర్ ద్వారా మేకర్స్ సినిమా విజువల్ గ్రాండియర్‌ను మరోసారి హైలైట్ చేశారు.
ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్స్‌ను అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన యాక్షన్ డైరెక్టర్ Vlad Rimburg డిజైన్ చేస్తున్నారు. భారీ ట్రైబల్ వార్స్, సముద్ర యుద్ధాలు, అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్సులు, అడ్వెంచర్ సెట్పీసులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ స్టూడియోలు ఈ ప్రాజెక్ట్‌పై అహర్నిశలు పనిచేస్తున్నాయి. ప్రాచీన దేవాలయాలు, మిస్టికల్ ప్రపంచాలు, భారీ యుద్ధ ఘట్టాలు, దైవిక శక్తులతో కూడిన విజువల్స్‌ను అత్యున్నత సాంకేతికతతో తెరపై ఆవిష్కరించేందుకు చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రతి ఫ్రేమ్‌ను హాలీవుడ్ స్థాయి నాణ్యతతో తీర్చిదిద్దుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇండస్ట్రీలో ఇప్పటికే Nagabandham: The Secret Treasure ను ఇటీవలి కాలంలో భారతీయ సినిమా నుంచి రాబోతున్న అతిపెద్ద విజువల్ స్పెక్టకల్స్‌లో ఒకటిగా అభివర్ణిస్తున్నారు.
ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో భారీ అప్డేట్ కూడా బయటకు వచ్చింది. నార్త్ ఇండియాలో అన్ని భాషల థియేట్రికల్ రిలీజ్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ Zee Studios సొంతం చేసుకుంది. హిందీ మార్కెట్‌లో భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ భాగస్వామ్యం ద్వారా ‘నాగబంధం’ దేశవ్యాప్తంగా మరింత భారీ స్థాయిలో ప్రేక్షకులకు చేరువ కానుంది.
అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ Amazon Prime Video ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగు శాటిలైట్ హక్కులను Star Maa సొంతం చేసుకోవడం కూడా ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.
ఈ చిత్రంలో Nabha Natesh, Aishwarya Menon, Jagapathi Babu, Mahesh Manjrekar, Rishab Sawhney తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన విజువల్స్, పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్సులు, అడ్వెంచర్ ఎపిసోడ్లు, ఆసక్తికరమైన కథాంశంతో Nagabandham: The Secret Treasure 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
