Thursday, May 28, 2026
HomeCinemaహ్యూమర్, సస్పెన్స్, థ్రిల్‌తో ‘జెట్లీ’ పూర్తి ఎంటర్‌టైనర్ – ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు: దర్శకుడు రితేష్...

హ్యూమర్, సస్పెన్స్, థ్రిల్‌తో ‘జెట్లీ’ పూర్తి ఎంటర్‌టైనర్ – ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు: దర్శకుడు రితేష్ రానా

హ్యూమర్, సస్పెన్స్, థ్రిల్‌తో ‘జెట్లీ’ పూర్తి ఎంటర్‌టైనర్ – ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు: దర్శకుడు రితేష్ రానా టాలీవుడ్‌లో తనదైన స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రితేష్ రానా, నటుడు సత్యతో కలిసి రూపొందించిన తాజా చిత్రం జెట్లీ. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. వెన్నెల […]

హ్యూమర్, సస్పెన్స్, థ్రిల్‌తో ‘జెట్లీ’ పూర్తి ఎంటర్‌టైనర్ – ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు: దర్శకుడు రితేష్ రానా

టాలీవుడ్‌లో తనదైన స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రితేష్ రానా, నటుడు సత్యతో కలిసి రూపొందించిన తాజా చిత్రం జెట్లీ. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించి సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రితేష్ రానా మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘జెట్లీ’ ప్రయాణం ఎప్పుడు మొదలైంది?

2020లో కోవిడ్ సమయంలో రచయిత జయేంద్రతో కలిసి ఈ కథను డెవలప్ చేశాను. అప్పటి నుంచే ఈ సినిమా చేయాలని అనుకుంటున్నాం. గత నవంబర్‌లో షూటింగ్ ప్రారంభించి ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధం చేశాం.

మొదట ఈ సినిమా పెద్ద హీరోతో చేయాలనుకున్నారా?

ఇది పూర్తిగా థ్రిల్లర్ కాదు, హ్యూమర్ కలిసిన థ్రిల్లర్‌గా చేయాలని అనుకున్నాం. మొత్తం సినిమా ఫ్లైట్‌లోనే జరుగుతుంది, అది ఒక ఎక్స్‌పెరిమెంట్. కొందరు ఈ టైంలో అలాంటి ప్రయత్నం అవసరమా అన్నారు. కానీ తర్వాత సత్య ఈ కథకు సరైన వ్యక్తి అనిపించింది. ‘మత్తు వదలరా’ తర్వాత నాకు ఈ స్థాయి సినిమా చేసే అవకాశం వచ్చింది. సత్యకి తగ్గట్టు పాత్రను మలిచాం.

సత్యకి కథ చెప్పినప్పుడు ఎలా స్పందించారు?

మొదట ఆయన పాత్ర ఫ్లైట్ అటెండర్‌గా ఉంది. తర్వాత ‘నువ్వే హీరో’ అని చెప్పగానే షాక్ అయ్యారు. ఇది రిస్క్ అని భావించారు. కానీ నేను కథను ఎలా తెరకెక్కిస్తానో వివరంగా చెప్పడంతో చాలా ఎక్సైట్ అయ్యారు. ఆయన పాత్రలో సీరియస్‌నెస్, హ్యూమర్, సస్పెన్స్ అన్నీ ఉంటాయి.

‘జెట్లీ’ టైటిల్‌కు కారణం?

జెట్ లీ అనే నటుడు ఉన్నారు. అలాగే కథ జెట్‌లో జరుగుతుంది. అందుకే ‘జెట్లీ’ అనే టైటిల్ పెట్టాం.

హీరో సత్యా? వెన్నెల కిషోరా?

అది సినిమా చూసిన తర్వాతే తెలుస్తుంది! (నవ్వుతూ)

షూటింగ్ అనుభవం ఎలా ఉంది?

ఈ సినిమా 80% ఫ్లైట్‌లోనే జరుగుతుంది. ఫ్లైట్ సెట్స్‌ను భారీగా నిర్మించాం—ఎకానమీ, బిజినెస్ క్లాస్, కార్గో, కాక్పిట్—all ఒకే ఫ్లోర్‌పై. నేను చేసిన సినిమాల్లో ఇది చాలా కష్టమైనది. దుబాయ్ నుంచి కొచ్చికి వచ్చే ప్రయాణంలో కథ జరుగుతుంది. యాక్షన్, థ్రిల్, హ్యూమర్ అన్నీ కలిపిన పూర్తి ఎంటర్‌టైనర్.

వెన్నెల కిషోర్ పాత్ర ఎలా ఉంటుంది?

ఆయన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సినిమా మొత్తం సుడోకు ఆడుతూ, పరిస్థితులకు తగ్గట్టు సినిమా టైటిల్స్ రాస్తూ కనిపిస్తారు. చాలా వినూత్నమైన పాత్ర.

రియా సింఘా పాత్ర గురించి?

ఇది ఆమె తొలి తెలుగు సినిమా. స్పెషల్ ఏజెంట్ పాత్రలో కనిపిస్తుంది. చాలా బాగా నటించింది.

అజయ్ పాత్ర గురించి?

అజయ్ గారు ‘ప్రజాపతి’ అనే పాత్రలో కనిపిస్తారు. బ్యాంక్ స్కామ్ చేసి పారిపోతుంటారు. ఆయన్ని తిరిగి తీసుకురావడమే కథలో కీలకం.

సత్యతో మీ అనుసంధానం ఎలా ఉంటుంది?

మా ఇద్దరికీ “నాన్ సింక్” ఉంటుంది. అదే మంచి సింక్‌గా మారుతుంది! (నవ్వుతూ) మేమిద్దరం వేరువేరు—అదే మాకు ప్లస్.

Director Ritesh Rana
Director Ritesh Rana

నిర్మాత చెర్రీ గురించి?

ఆయనతో నాకు పర్ఫెక్ట్ అండర్‌స్టాండింగ్ ఉంది. నా ఎక్స్‌పెరిమెంట్స్‌కి ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. హీరో మార్పు జరిగినా నాపై పూర్తి నమ్మకం ఉంచారు.

కాలభైరవ మ్యూజిక్ ఎలా ఉంది?

నా టెక్నికల్ టీమ్ మొదటి సినిమా నుంచే నాతో ఉంది. ఈ సినిమాలో ఒక పాటతో పాటు బలమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. సినిమా నిడివి సుమారు 2 గంటలు 10 నిమిషాలు.

మీ కామెడీ స్టైల్‌పై ఎవరి ప్రభావం ఉంది?

చాలామంది ప్రభావం ఉంది. ముఖ్యంగా క్రేజీ మోహన్ గారి కామెడీ నాకు చాలా ఇష్టం. సెటైర్, సర్కాసం కూడా ఇష్టపడతాను. హాలీవుడ్ కామెడీ కూడా నచ్చుతుంది.

ఈ సినిమాలో చిరంజీవి గారి రిఫరెన్స్ ఉందా?

అవును, సినిమా చిరంజీవి గారి ఫ్రేమ్‌తో ప్రారంభమవుతుంది. నా గత సినిమాల్లోలాగే ఇందులో కూడా ఆయనకు రిఫరెన్స్ ఉంది.

ప్రమోషన్స్ గురించి?

ఈ రోజుల్లో ప్రమోషన్స్ చాలా కీలకం. షూటింగ్ సమయంలోనే ప్లాన్ చేస్తాను. ఈ సినిమాకి కూడా అదే విధంగా చేశాం.

టఫ్ సీన్స్ ఏవైనా ఉన్నాయా?

రెండు ముఖ్యమైన సీక్వెన్సులు ఉన్నాయి. వాటి CGIకి నాలుగు నెలలు పట్టింది. అవి చాలా స్టైలిష్‌గా వచ్చాయి.

సీక్వెల్‌కు అవకాశం ఉందా?

చిత్రంలో చాలా ఆసక్తికరమైన పాత్రలు ఉన్నాయి. సినిమా సక్సెస్ అయితే సీక్వెల్‌కు మంచి అవకాశముంది.

మీకు ఇష్టమైన జానర్ ఏది?

నాకు హారర్ జానర్ చాలా ఇష్టం. నా తదుపరి సినిమా హారర్‌గా ఉండే అవకాశం ఉంది, కొత్త వాళ్లతో చేయాలని ప్లాన్ చేస్తున్నాను.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories