Thursday, May 28, 2026
HomeLatestశ్రీనివాస మంగాపురం నుంచి బ్రహ్మాజీ బాలు ఫస్ట్ లుక్ విడుదల

శ్రీనివాస మంగాపురం నుంచి బ్రహ్మాజీ బాలు ఫస్ట్ లుక్ విడుదల

‘శ్రీనివాస మంగాపురం’ నుంచి బ్రహ్మాజీ ‘బాలు’ ఫస్ట్ లుక్ విడుదల ప్రేక్షకులను తన ప్రత్యేక శైలితో ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి, RX 100, మంగళవారం వంటి చిత్రాల విజయాల తరువాత ఇప్పుడు శ్రీనివాస మంగాపురం అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె […]

‘శ్రీనివాస మంగాపురం’ నుంచి బ్రహ్మాజీ ‘బాలు’ ఫస్ట్ లుక్ విడుదల

ప్రేక్షకులను తన ప్రత్యేక శైలితో ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి, RX 100, మంగళవారం వంటి చిత్రాల విజయాల తరువాత ఇప్పుడు శ్రీనివాస మంగాపురం అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది.

ఇక ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ‘బాలు’ అనే పాత్రలో ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బ్రహ్మాజీ మైక్ పట్టుకుని ఉత్సాహంగా కనిపిస్తూ, తన పాత్ర వినోదభరితంగా ఉండబోతుందనే సంకేతాలు ఇస్తున్నారు. ‘బాలు’ పాత్ర థియేటర్లలో ప్రేక్షకులను ఖచ్చితంగా అలరించనుంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పిస్తుండగా, పి. కిరణ్ నిర్మిస్తున్నారు.

టెక్నికల్ టీమ్ కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని జయకృష్ణ ISC నిర్వహిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలను మాధవ్ కుమార్ గుల్లపాటి నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా సాహి సురేష్ పని చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు రియల్ సతీష్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

బలమైన నటీనటులు, ప్రతిభావంతమైన టెక్నికల్ టీమ్‌తో శ్రీనివాస మంగాపురం ప్రేక్షకుల ముందుకు రానున్న ఆసక్తికరమైన చిత్రంగా నిలుస్తోంది.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories