రష్మిక మందన్న ‘మైసా’లో అన్‌సీన్ అవతార్ – కేరళలో బ్రూటల్ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లో మరో భారీ మైలురాయిగా నిలిచే పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఇంటెన్స్ గ్లింప్స్ ఈ చిత్రంపై భారీ అంచనాలను రేకెత్తించాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కంటెంట్, మేకింగ్ పరంగా కొత్తదనాన్ని అందించబోతోందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ కేరళలో ప్రారంభమైంది. మొత్తం 15 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ పూర్తిగా హై వోల్టేజ్, బ్రూటల్ యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయి ఉంటుంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా ఖంపక్దీ మాస్టర్ నేతృత్వంలో తెరకెక్కుతున్న ఈ ఎపిసోడ్ సినిమాలో మేజర్ హైలెట్‌గా నిలవనుంది. రష్మికతో పాటు ఇతర కీలక నటీనటులు కూడా ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
‘మైసా’లో రష్మిక ఒక గోండ్ గిరిజన యువతిగా కనిపించనున్నారు. భావోద్వేగపరంగా గాఢతతో పాటు శారీరకంగా కూడా బలమైన ఈ పాత్ర కోసం ఆమె విపరీతంగా శ్రమించారు. ఈ పాత్రకు న్యాయం చేయడానికి రష్మిక బ్యాంకాక్‌లో అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారు. రోజుకు సుమారు ఎనిమిది గంటల పాటు అడ్వాన్స్‌డ్ స్టంట్స్, హ్యాండ్-టు-హ్యాండ్ కాంబాట్, హై-స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్‌పై ప్రత్యేకంగా శిక్షణ పొందారు.
ఈ చిత్రంలో రష్మిక ఇప్పటివరకు కనిపించని ఇంటెన్స్, రగ్డ్, ఎక్స్‌ప్లోసివ్ అవతార్‌లో కనిపించబోతుండటం విశేషం. ఆమె ఈ కొత్త లుక్, పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.
ఈ సినిమాలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రేయాస్ పి కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జేక్స్ బీజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తూ చిత్రానికి అంతర్జాతీయ స్థాయి టచ్ అందిస్తున్నారు.
‘మైసా’—యాక్షన్, ఎమోషన్, రియలిజం కలగలిపిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.
