హైదరాబాద్ నగరంలో క్రీడాకారులు, ఫిట్‌నెస్ అభిరుచి కలిగిన వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు Apollo Hospitals మరో కీలక అడుగు వేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన “Apollo Centre of Excellence for Sports Injuries & Orthopaedics”ను ఘనంగా ప్రారంభించింది.
ఈ ప్రత్యేక కేంద్రం ద్వారా స్పోర్ట్స్ ఇంజరీలు, లిగమెంట్ గాయాలు, జాయింట్ సమస్యలు, మసిల్ డ్యామేజ్ వంటి సమస్యలకు ఒకే చోట నిర్ధారణ, శస్త్రచికిత్స, రీహాబిలిటేషన్ సేవలు అందించనున్నారు. ముఖ్యంగా ప్రొఫెషనల్ క్రీడాకారులు, జిమ్ మరియు ఫిట్‌నెస్ కార్యకలాపాల్లో పాల్గొనే యువతకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి KEI Group వ్యవస్థాపకుడు అనిల్ కామినేని, తెలంగాణ ప్రభుత్వ క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి Jayesh Ranjan తదితర ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఐపీఎల్ జట్టు Sunrisers Hyderabad సభ్యులు కూడా కొత్తగా ప్రారంభించిన స్పోర్ట్స్ ఇంజరీస్ సెంటర్‌ను సందర్శించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ Pat Cumminsతో పాటు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్‌కు ఆసుపత్రి ప్రతినిధులు అత్యాధునిక వైద్య సదుపాయాలను వివరించారు. క్రీడాకారుల గాయాల చికిత్స, వేగవంతమైన రికవరీకి ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.
అపోలో హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ దీప్తి నందన్ రెడ్డి మాట్లాడుతూ.. స్పోర్ట్స్ ఇంజరీలకు సమయానికి సరైన చికిత్స చాలా అవసరమన్నారు. చిన్న గాయాలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలుగా మారే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఈ కేంద్రంలో ఆధునిక శస్త్రచికిత్సా విధానాలు, శాస్త్రీయ రీహాబిలిటేషన్ పద్ధతులతో రోగులను త్వరగా కోలుకునేలా చేస్తామని చెప్పారు.
అపోలో హాస్పిటల్స్ తెలుగు రాష్ట్రాల సీఈఓ తేజస్వి రావు వీరేపల్లి మాట్లాడుతూ.. ప్రస్తుతం యువతలో క్రీడలు, ఫిట్‌నెస్ కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతోందన్నారు. దీంతో స్పోర్ట్స్ మెడిసిన్, ప్రత్యేక చికిత్సల అవసరం కూడా అధికమవుతోందని పేర్కొన్నారు. ఈ కొత్త సెంటర్ ద్వారా ప్రపంచ స్థాయి వైద్య సేవలను హైదరాబాద్‌లోనే అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు.
అపోలో హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్కరన్ సింగ్ మాట్లాడుతూ.. ఈ కేంద్రంలో ఆర్థోపెడిక్ నిపుణులు, ఫిజియోథెరపిస్టులు, రీహాబిలిటేషన్ స్పెషలిస్టులు కలిసి పనిచేస్తారని తెలిపారు. ప్రతి రోగికి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక చికిత్సా ప్రణాళిక రూపొందించి వేగంగా కోలుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
క్రీడలలో గాయాలు సాధారణమే అయినప్పటికీ, సరైన వైద్య సేవలు అందితే ఆటగాళ్లు త్వరగా మళ్లీ మైదానంలోకి రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రారంభమైన అపోలో స్పోర్ట్స్ ఇంజరీస్ & ఆర్థోపెడిక్స్ సెంటర్ క్రీడాకారులకు పెద్ద ఊరటనివ్వనుంది.
Apollo Launches Advanced Sports Injury Centre in Hyderabad
