Wednesday, June 17, 2026
HomeHyderabadNewsఅభిమాని కోసం హనుమకొండకు పవన్ కళ్యాణ్

అభిమాని కోసం హనుమకొండకు పవన్ కళ్యాణ్

హనుమకొండ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన డి.ఎన్.డి వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన హనుమకొండకు చెందిన 17 ఏళ్ల అభిమాని నిరంజన్‌ను ఆయన స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. అభిమాని చివరి కోరికగా తనను కలవాలని కోరుకున్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, బుధవారం హనుమాన్ నగర్‌లోని నిరంజన్ నివాసానికి చేరుకుని అతనితో ఆత్మీయంగా ముచ్చటించారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి […]

హనుమకొండ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన డి.ఎన్.డి వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన హనుమకొండకు చెందిన 17 ఏళ్ల అభిమాని నిరంజన్‌ను ఆయన స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. అభిమాని చివరి కోరికగా తనను కలవాలని కోరుకున్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, బుధవారం హనుమాన్ నగర్‌లోని నిరంజన్ నివాసానికి చేరుకుని అతనితో ఆత్మీయంగా ముచ్చటించారు.

నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసలకు ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేసి, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి తీర్థప్రసాదాలు, వస్త్రాలు అందించి ఆశీర్వదించారు. నిరంజన్ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భగవంతుడి కృప ఉంటుందని భరోసా ఇచ్చారు.

అభిమానిని చూసి భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్ అతని మంచం వద్ద కూర్చుని ఆప్యాయంగా హత్తుకుని, నుదిటిపై ముద్దు పెట్టారు. చిన్ననాటి నుంచే తనపై అభిమానమని నిరంజన్ చెప్పడంతో కదిలిపోయిన ఆయన, ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్‌ను అనుకరిస్తూ చేసిన డ్యాన్స్ వీడియోలు, ఫొటోలను పరిశీలించారు. తనను అందరూ “చోటా గబ్బర్ సింగ్” అని పిలుస్తారని నిరంజన్ చెప్పగా పవన్ కళ్యాణ్ చిరునవ్వులు చిందించారు.

ఈ సందర్భంగా నిరంజన్ కుటుంబ పరిస్థితులను కూడా తెలుసుకున్న పవన్ కళ్యాణ్, గతంలో వారు క్యాంటీన్ నిర్వహించేవారని తెలుసుకుని జీవనోపాధి మెరుగుపడేలా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని జనసేన తెలంగాణ నాయకులకు సూచించారు. నిరంజన్ పెంపుడు కుక్కను పెంచుకోవాలనే కోరికను వ్యక్తం చేయగా, దానిని కూడా నెరవేర్చుతానని హామీ ఇచ్చారు.

నిరంజన్‌ను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా వరంగల్‌లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిరంజన్ ఆరోగ్యం కోసం అమ్మవారికి పట్టువస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిరంజన్ కోసం ప్రత్యేకంగా చేయించిన అమ్మవారి వెండి ప్రతిమను ఆలయంలో పూజింపజేసి అతని తల్లిదండ్రులకు అందజేశారు.

పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో జనసైనికులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన పర్యటనకు సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ సి.వి. ఆనంద్, వరంగల్ జిల్లా పోలీసు యంత్రాంగానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Pawan Kalyan Visits Ailing Fan Niranjan, Offers Support and Special Prayers at

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories