Thursday, May 28, 2026
HomeHyderabadHyderabad: ORR భద్రతపై కీలక సమీక్ష.. ముందస్తు జాగ్రత్తలపైCP VC Sajjanar ఫోకస్

Hyderabad: ORR భద్రతపై కీలక సమీక్ష.. ముందస్తు జాగ్రత్తలపైCP VC Sajjanar ఫోకస్

హైదరాబాద్ ORRపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు ముందస్తు జాగ్రత్తలతోనే ప్రాణాలు కాపాడొచ్చు : CP VC Sajjanar హైదరాబాద్ మహానగరాన్ని చుట్టుముట్టిన ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేస్తూ రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ VC Sajjanar, IPS అధ్యక్షతన మంగళవారం TGICCCలో కీలక సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో Transport Department […]

హైదరాబాద్ ORRపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

ముందస్తు జాగ్రత్తలతోనే ప్రాణాలు కాపాడొచ్చు : CP VC Sajjanar

హైదరాబాద్ మహానగరాన్ని చుట్టుముట్టిన ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేస్తూ రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ VC Sajjanar, IPS అధ్యక్షతన మంగళవారం TGICCCలో కీలక సమన్వయ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో Transport Department Commissioner Ilambarithi, IAS, HMDA Urban Forestry Director VSNV Prasad, IFSతో పాటు NHAI, GHMC, HGCL, IRB Infra ప్రతినిధులు, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు. ORR నిర్వహణ సంస్థ IRB Infra ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రస్తుతం అమలు చేస్తున్న Road Safety చర్యలను వివరించారు.

అనంతరం మాట్లాడిన CP VC Sajjanar, ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు చర్యల ద్వారానే అనేక ప్రాణాలను రక్షించవచ్చని స్పష్టం చేశారు. ప్రతిరోజూ సగటున 2.80 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ORRపై భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం రోజుకు ఐదు నుంచి ఆరు ప్రమాదాలు నమోదవుతున్నాయని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వీటిని “Zero Accidents” దిశగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కేవలం చలాన్లు విధించడం కాకుండా ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. అలాగే ORRలోకి ప్రవేశించే వాహనదారుల మొబైల్ ఫోన్లకు Road Safety Alert Messages పంపే విధానాన్ని కూడా పరిశీలించాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో Response Time తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అవసరమైతే Traffic Marshals సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు.

బ్రేక్‌డౌన్ మినహా ఇతర కారణాలతో ORRపై వాహనాలను నిలపరాదని, అనివార్య పరిస్థితుల్లో వాహనం ఆపాల్సి వస్తే వెంటనే హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించి, రిఫ్లెక్టివ్ ట్రయాంగిల్స్, హజార్డ్ లైట్లు ఉపయోగిస్తూ ఎడమ వైపు చివరి లేన్‌లోనే నిలపాలని స్పష్టం చేశారు.

గత నాలుగు నెలల ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే, నిద్రమత్తు కారణంగా 33 శాతం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల 25 శాతం, అతివేగం వల్ల 15 శాతం, టైర్లు పేలడం వల్ల 14 శాతం ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వాహనదారుల్లో అవగాహన పెంచడం ద్వారా ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.

రవాణా శాఖ కమిషనర్ Ilambarithi, IAS మాట్లాడుతూ, ప్రమాదాల నివారణకు తమ శాఖ అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకుంటోందన్నారు. ముఖ్యంగా వాహనాల Fitness, Brake Systems, Tyre Quality తనిఖీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ORR Road Safetyపై ప్రతినెలా సమీక్షా సమావేశాలు నిర్వహించడం అవసరమని అభిప్రాయపడ్డారు.

ORRలో డ్రైవింగ్ చేసే వారికి ముఖ్య సూచనలు

  • రాత్రి సమయంలో అధిక వేగంతో ప్రయాణించవద్దు
  • నిద్రమత్తుగా అనిపిస్తే వెంటనే Safe Parking Zoneలో ఆపిలి
  • టైర్ల గాలి ఒత్తిడి, బ్రేకులు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి
  • హజార్డ్ లైట్లు, Reflective Warning Triangle వాహనంలో ఉంచుకోవాలి
  • లేన్ మార్చేటప్పుడు తప్పనిసరిగా ఇండికేటర్లు ఉపయోగించాలి
  • వర్షం లేదా పొగమంచు సమయంలో వేగాన్ని తగ్గించాలి
  • డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం పూర్తిగా నివారించాలి
  • రాత్రి ప్రయాణాల్లో హై బీమ్‌ను అవసరమైనప్పుడే ఉపయోగించాలి

ఈ సమావేశంలో Additional CP Tafseer Iqbal, NHAI DGM P. Meera Anusha, Hyderabad Traffic DCP Rahul Hegde, IPS, Avinash Kumar, IPS, Malkajgiri Traffic DCP Rahul Reddy, IPS తదితర అధికారులు పాల్గొన్నారు.

VC Sajjanar Chairs High-Level Meeting on Road Safety at Hyderabad

ORR
ORR

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories