Tuesday, July 28, 2026
HomeCinema'మారెమ్మ' నుంచి ఆకట్టుకుంటున్న మారి సాంగ్

‘మారెమ్మ’ నుంచి ఆకట్టుకుంటున్న మారి సాంగ్

‘మారెమ్మ’ నుంచి ఆకట్టుకుంటున్న ‘మారి’ సాంగ్ మాధవ్, దీపా బాలు జంటగా నటించిన ‘మారెమ్మ’ చిత్రంలోని ‘మారి’ పాట విడుదల మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయమవుతున్న తెలంగాణ గ్రామీణ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా దీపా బాలు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, […]

‘మారెమ్మ’ నుంచి ఆకట్టుకుంటున్న ‘మారి’ సాంగ్

మాధవ్, దీపా బాలు జంటగా నటించిన ‘మారెమ్మ’ చిత్రంలోని ‘మారి’ పాట విడుదల

మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయమవుతున్న తెలంగాణ గ్రామీణ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా దీపా బాలు నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, తొలి పాట **’బావ బావ’**కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి స్వరపరిచిన ఈ చిత్రంలోని రెండో పాట **’మారి’**ని తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. మిట్టపల్లి సురేందర్ రచించిన సాహిత్యం, గాయని మంగ్లీ ఆలపించిన భావోద్వేగ గానం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

హీరో మాధవ్

సాంగ్ లాంచ్ కార్యక్రమంలో హీరో మాధవ్ మాట్లాడుతూ, “మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. సినిమా పూర్తిగా సిద్ధమైంది. ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాం. త్వరలోనే ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తాం. ‘మారెమ్మ’ ఒక స్వచ్ఛమైన తెలంగాణ రూటెడ్ విలేజ్ స్టోరీ. ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. మా సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది” అన్నారు.

నిర్మాత మయూర్ రెడ్డి బండారు

నిర్మాత మయూర్ రెడ్డి బండారు మాట్లాడుతూ, “‘మారి’ పాటకు వస్తున్న స్పందన చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ సంస్కృతి, పల్లె జీవనం, అక్కడి మనుషుల భావోద్వేగాలను ఎంతో సహజంగా ఈ సినిమాలో చూపించాం. దర్శకుడు నాగరాజు కథ చెప్పిన వెంటనే మా ఊరి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. సినిమాలోని ప్రతి పాత్ర మనకు తెలిసిన వ్యక్తిలా అనిపిస్తుంది. ఇటీవల జాతరకు వెళ్లినప్పుడు కూడా మా సినిమాలోని అనేక సన్నివేశాలు నిజ జీవితంలో కనిపించాయి. పాటలన్నీ కథలో భాగంగానే వస్తాయి. మిట్టపల్లి సురేందర్ అద్భుతమైన సాహిత్యం అందించగా, ప్రశాంత్ ఆర్. విహారి అద్భుతమైన సంగీతం సమకూర్చారు. దర్శకుడు నాగరాజు సినిమాను ఎంతో నిజాయితీగా తెరకెక్కించారు. మాధవ్, దీపా బాలు ఇద్దరూ అద్భుతమైన నటన కనబరిచారు. ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది” అని తెలిపారు.

హీరోయిన్ దీపా బాలు

హీరోయిన్ దీపా బాలు మాట్లాడుతూ, “‘బావ బావ’ పాటకు, టీజర్‌కు ప్రేక్షకులు అందించిన ఆదరణకు ధన్యవాదాలు. నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది నా తొలి తెలుగు సినిమా కావడంతో చాలా ప్రత్యేకంగా భావిస్తున్నాను. ప్రేక్షకులంతా థియేటర్లలో సినిమా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

దర్శకుడు మంచాల నాగరాజు

దర్శకుడు మంచాల నాగరాజు మాట్లాడుతూ, “సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమైంది. విడుదలకు పూర్తిగా రెడీగా ఉన్నాం. తెలుగులో కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో రూపొందిన చిత్రమిది. ‘మారి’ పాటలో తమోజ్ఞ, సర్కార్ అద్భుతంగా నటించారు. మంగ్లీ గాత్రం పాటకు మరింత బలం చేకూర్చింది. మిట్టపల్లి సురేందర్ అందించిన సాహిత్యం కూడా ఎంతో హృదయాన్ని తాకుతుంది. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడికి మంచి అనుభూతిని అందిస్తుందనే విశ్వాసం ఉంది” అన్నారు.

ఎడిటర్ సాయిబాబు

ఎడిటర్ సాయిబాబు మాట్లాడుతూ, “ఇలాంటి రూటెడ్ కథను నిర్మించాలంటే నిర్మాతకు ఎంతో ధైర్యం అవసరం. దర్శకుడు తన విజన్‌ను అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. ప్రేక్షకులకు ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది” అని అన్నారు.

సినిమాటోగ్రాఫర్ ప్రశాంత్ అంకిరెడ్డి

సినిమాటోగ్రాఫర్ ప్రశాంత్ అంకిరెడ్డి మాట్లాడుతూ, “‘మారెమ్మ’ పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే సహజమైన కథ. ప్రతి ఫ్రేమ్ నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించాం. మాధవ్ ఎంతో సహజంగా నటించారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ప్రేక్షకులు థియేటర్లలో ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

చైల్డ్ ఆర్టిస్టులు

చైల్డ్ ఆర్టిస్ట్ తమోజ్ఞ మాట్లాడుతూ, “ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. షూటింగ్ మొత్తం ఎంతో ఆనందంగా సాగింది. ప్రేక్షకులందరూ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

మరో చైల్డ్ ఆర్టిస్ట్ సర్కార్ మాట్లాడుతూ, “ఈ సినిమాలో హీరో చిన్ననాటి పాత్రను పోషించడం ఎంతో ఆనందంగా ఉంది. షూటింగ్ అనుభవం చాలా బాగుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని తెలిపారు.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories