Tuesday, July 28, 2026
HomeEducationతెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: CM Revanth Reddy

తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: CM Revanth Reddy

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని, విద్య ద్వారానే విద్యార్థుల తలరాత మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులకు […]

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని, విద్య ద్వారానే విద్యార్థుల తలరాత మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులకు యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్‌తో కలిసి రూ.50.73 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇందులో రూ.36.65 కోట్లతో వివిధ జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, క్రీడా సదుపాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయగా, రూ.14.08 కోట్లతో గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియంలలో ఏర్పాటు చేసిన పలు క్రీడా అకాడమీలను ప్రారంభించారు.

యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రం అరవై ఏళ్ల ఉద్యమం, వందలాది మంది యువత ఆత్మబలిదానాల ఫలితంగా ఏర్పడిందని గుర్తు చేశారు. గతంలో విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేశారని విమర్శించిన ఆయన, విద్యా రంగ పునరుద్ధరణకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

బడ్జెట్‌లో విద్యకు 8.5 శాతం నిధులు కేటాయించామని, విద్యా అభివృద్ధి కోసం రూ.26,600 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇది ఖర్చు కాదని, భవిష్యత్ తరాలపై పెట్టుబడి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రీ-ప్రైమరీ విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించి దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతామని సీఎం పేర్కొన్నారు. రాబోయే ఒలింపిక్స్‌ను లక్ష్యంగా పెట్టుకుని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

కృత్రిమ మేధస్సు (AI) ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల స్వరూపం మారుతోందని పేర్కొన్న సీఎం, యువతకు నైపుణ్య శిక్షణ అత్యవసరమన్నారు. ఇంగ్లీష్‌తో పాటు జర్మన్, జపనీస్ భాషల శిక్షణ అందిస్తున్నామని, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతలోని ప్రతిభను వెలికితీసి ప్రపంచ స్థాయి అవకాశాలకు సిద్ధం చేస్తున్నామని వివరించారు.

సోషల్ వెల్ఫేర్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు భవిష్యత్తులో డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “మీ తలరాతను మార్చేది చదువొక్కటే. మీరు చదవండి… మీకు కావాల్సిన ప్రతి అవకాశాన్ని కల్పించే బాధ్యత మీ రేవంతన్న తీసుకుంటాడు” అని సీఎం అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 27.50 లక్షల మంది విద్యార్థులకు యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి “అన్న-అక్క మెంటార్‌షిప్” కార్యక్రమాన్ని కూడా ఆవిష్కరించారు.

CM Revanth Launches Young India Kits, Leads Anti-Drugs Pledge

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories