Tuesday, July 28, 2026
HomeTelangana & APఅభిమాని నిరంజన్ మృతితో పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి.. హనుమకొండ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న ఉప ముఖ్యమంత్రి

అభిమాని నిరంజన్ మృతితో పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి.. హనుమకొండ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న ఉప ముఖ్యమంత్రి

హైదరాబాద్/హనుమకొండ: అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న 17 ఏళ్ల అభిమాని నిరంజన్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత నెల హనుమకొండలోని నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లి అతని చివరి కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్, అతని మరణ వార్త తన హృదయాన్ని కలిచివేసిందని తెలిపారు. జూన్ 17న హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్, అతని ఆరోగ్య పరిస్థితిని […]

హైదరాబాద్/హనుమకొండ: అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న 17 ఏళ్ల అభిమాని నిరంజన్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత నెల హనుమకొండలోని నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లి అతని చివరి కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్, అతని మరణ వార్త తన హృదయాన్ని కలిచివేసిందని తెలిపారు.

జూన్ 17న హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్, అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని చాలా సేపు అతనితో గడిపారు. మంచానికే పరిమితమైన నిరంజన్ పక్కనే కూర్చొని అతని చేతిని పట్టుకుని ధైర్యం చెప్పారు. అతనితో సెల్ఫీలు దిగడంతో పాటు ఆలయ ప్రసాదాన్ని అందించి, ఆర్థిక సహాయాన్ని కూడా చేశారు. నిరంజన్ తల్లిదండ్రులు పొనుగోటి రంగోపాల్, మానసలను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

నిరంజన్ మృతిపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన పవన్ కళ్యాణ్, “కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన క్షణాలు ఇప్పటికీ నా మదిలో సజీవంగా ఉన్నాయి. తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ నన్ను చూడాలని ఎదురుచూసిన ఆ చిన్నారి ముఖంలో నేను కనిపించగానే మెరిసిన చిరునవ్వు జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకం. శరీరం వ్యాధితో పోరాడుతున్నా, అతని మనసు మాత్రం అపార ధైర్యంతో నిలిచింది. జీవితంపై అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో స్ఫూర్తిదాయకం. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మన మధ్య లేకపోవడం హృదయ విదారకం” అని పేర్కొన్నారు.

“నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే శక్తిని దేవుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన నిరంజన్… నీ చిరునవ్వు, నీ ధైర్యం, నాపై చూపిన ప్రేమ ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా నివాళులర్పించారు.

ఇదిలా ఉండగా, ప్రముఖ నటుడు, సేవా కార్యక్రమాలకు పేరుగాంచిన సోనూ సూద్ కూడా వీడియో కాల్ ద్వారా నిరంజన్ తల్లిదండ్రులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, తమ కుటుంబానికి అవసరమైన సహాయం ఎప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. నిరంజన్‌కు సోనూ సూద్ కూడా ఎంతో ఇష్టమైన నటుడని, ఆయన్ను ఒకసారి కలవాలని కోరిక వ్యక్తం చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

పవన్ కళ్యాణ్ హనుమకొండలో నిరంజన్‌ను కలిసిన సమయంలో అతను చిన్నతనంలో పవన్ కళ్యాణ్ పాటలకు నృత్యం చేసిన వీడియోలు, ఫొటోలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. అభిమాని పరిస్థితిని చూసి కళ్లలో నీళ్లు తెచ్చుకున్న ఆయన, నిరంజన్‌ను ఆప్యాయంగా హత్తుకుని నుదుటిపై ముద్దుపెట్టి ధైర్యం చెప్పిన దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories