Tuesday, July 28, 2026
HomeTelangana & APపవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన CM చంద్రబాబు

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన CM చంద్రబాబు

ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు. కొద్దిసేపటి క్రితం ముంబయిలోని ఆస్పత్రికి చేరుకున్న సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు అందిస్తున్న చికిత్స, కోలుకునే ప్రక్రియపై వైద్య బృందంతో కూడా చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి, వైద్యుల సూచనలను […]

ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు. కొద్దిసేపటి క్రితం ముంబయిలోని ఆస్పత్రికి చేరుకున్న సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు అందిస్తున్న చికిత్స, కోలుకునే ప్రక్రియపై వైద్య బృందంతో కూడా చర్చించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి, వైద్యుల సూచనలను పూర్తిగా పాటిస్తూ విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రజలు, జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.

గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్‌కు వైద్యుల సలహా మేరకు ముంబయిలోని ప్రముఖ ఆస్పత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శతో పవన్ కళ్యాణ్‌కు మరింత ధైర్యం లభించిందని, ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొంటారని అభిమానులు, పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

CM Chandrababu Visits Pawan Kalyan in Mumbai Hospital

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories