Friday, September 4, 2026
HomeCinema'కొరియన్ కనకరాజు'లో వరుణ్ తేజ్ డబుల్ షేడ్స్ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్: మేర్లపాక గాంధీ

‘కొరియన్ కనకరాజు’లో వరుణ్ తేజ్ డబుల్ షేడ్స్ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్: మేర్లపాక గాంధీ

‘కొరియన్ కనకరాజు’లో వరుణ్ తేజ్ డబుల్ షేడ్స్ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్: మేర్లపాక గాంధీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు మేర్లపాక గాంధీ సినిమా విశేషాలను పంచుకున్నారు. అనంతపురంలోని కియా ఫ్యాక్టరీ పరిసరాల్లో కొరియన్ కమ్యూనిటీని చూసిన అనుభవమే ఈ కథకు ప్రేరణ అని ఆయన తెలిపారు. “ఒక కొరియన్ ఆత్మ అనంతపురం యువకుడిని ఆవహిస్తే ఎలా […]

‘కొరియన్ కనకరాజు’లో వరుణ్ తేజ్ డబుల్ షేడ్స్ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్: మేర్లపాక గాంధీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు మేర్లపాక గాంధీ సినిమా విశేషాలను పంచుకున్నారు.

అనంతపురంలోని కియా ఫ్యాక్టరీ పరిసరాల్లో కొరియన్ కమ్యూనిటీని చూసిన అనుభవమే ఈ కథకు ప్రేరణ అని ఆయన తెలిపారు. “ఒక కొరియన్ ఆత్మ అనంతపురం యువకుడిని ఆవహిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో కథ మొదలైంది” అని చెప్పారు.

మొదట మరో కథను వరుణ్ తేజ్‌కు వినిపించినప్పటికీ, ఈ కాన్సెప్ట్ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌ను అభివృద్ధి చేశామని వెల్లడించారు. “కనకరాజు, కొరియన్ అనే రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో వరుణ్ తేజ్ అద్భుతంగా నటించారు. ఆయన పాత్రలోని వేరియేషన్స్ ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్‌గా నిలుస్తాయి” అని పేర్కొన్నారు.

సినిమాలో హారర్, కామెడీతో పాటు భావోద్వేగాలు, అందమైన ప్రేమకథ కూడా ఉంటాయని చెప్పారు. సత్య, సునీల్, మురళీధర్ గౌడ్ తదితరుల పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని తెలిపారు.

హీరో, హీరోయిన్‌కు కొరియన్ భాషతో పాటు అనంతపురం యాసలో ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, కొరియాలో 20 రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు వెల్లడించారు. కొంత భాగాన్ని కజకిస్థాన్‌లో కూడా షూట్ చేసినట్లు చెప్పారు.

సంగీత దర్శకుడు థమన్ అందించిన పాటలు ఇప్పటికే మంచి స్పందన అందుకున్నాయని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

‘కొరియన్ కనకరాజు’ మంచి ఫన్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. వరుణ్ తేజ్‌తో కలిసి ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా చేశాం. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అని దర్శకుడు మేర్లపాక గాంధీ ధీమా వ్యక్తం చేశారు.

Varun Tej’s Role In Korean Kanakaraju Will Surprise Audiences Merlapaka Gandhi
Merlapaka Gandhi

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories