హైదరాబాద్, జూన్ 19:
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించేందుకు Hyderabad Traffic Police ఆధ్వర్యంలో Ravindra Bharathiలో ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు, రవాణా, విద్యా, మున్సిపల్, భద్రతా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
సమావేశంలో నగర ట్రాఫిక్ పరిస్థితులు, విద్యార్థుల రహదారి భద్రత, స్కూల్ జోన్‌లలో తీసుకోవాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య 92.96 లక్షలకు చేరుకుందని, రోజుకు సగటున 1,500 కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయని వివరించారు. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు నగరంలో 1,604 రోడ్డు ప్రమాదాలు నమోదవగా, వాటిలో 128 మంది చిన్నారులు బాధితులుగా మారినట్లు వెల్లడించారు. వీరిలో ఏడుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
విద్యార్థుల సురక్షిత ప్రయాణం కోసం ప్రతి పాఠశాల తమ విద్యార్థుల రవాణా వివరాలతో ప్రత్యేక Travel Database నిర్వహించాలని సూచించారు. స్కూల్ గేట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం Traffic Marshals నియామకం, School Zone Boards, Speed Limit Signages, Zebra Crossings, CCTV Cameras ఏర్పాటు తప్పనిసరి చేయాలని సూచించారు. స్కూల్ ఆటోలలో ఆరుగురికి మించి విద్యార్థులను ఎక్కించవద్దని హెచ్చరించారు.
మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు Motor Vehicles Act-2019 ప్రకారం కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన రిజిస్ట్రేషన్‌ను 12 నెలల పాటు రద్దు చేయడంతో పాటు తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటివరకు నగరంలో 719 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు వెల్లడించారు.
స్కూల్ వాహనాల డ్రైవర్లకు క్రమం తప్పకుండా శిక్షణ, వైద్య పరీక్షలు నిర్వహించాలని, స్కూల్ బస్సులు మరియు ఇతర విద్యార్థుల రవాణా వాహనాలకు ఫిట్‌నెస్ ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రైవేట్ రవాణా వాహనాల వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేసే ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
విద్యార్థుల భద్రత విషయంలో పాఠశాలలు కేవలం విద్య బోధనకే పరిమితం కాకుండా రహదారి భద్రత, సైబర్ భద్రత, డ్రగ్స్ నివారణ, మైనర్ డ్రైవింగ్ నియంత్రణ వంటి అంశాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రతి పాఠశాల తప్పనిసరిగా ఒక Transport Managerను నియమించుకోవాలని, స్కూల్ పరిసరాల్లో భద్రతా పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం, Hyderabad Traffic Police, Transport Department, Education Department మరియు UNICEF సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో Road Safety Awareness Programmes నిర్వహిస్తున్నాయని తెలిపారు. హెల్మెట్ వినియోగం, సీట్‌బెల్ట్ తప్పనిసరి, మైనర్ డ్రైవింగ్ నియంత్రణ, సురక్షిత స్కూల్ జోన్‌ల ఏర్పాటు వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ అవగాహన కార్యక్రమాలను ప్రజలు స్వీకరించి, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.
ఈ సమావేశంలో Hyderabad City Police Commissioner V.C. Sajjanar, IPS, Transport Commissioner Dr. K. Ilambarithi, IAS, GHMC Commissioner R.V. Karnan, IAS, UNICEF Representative Dr. Jelalem Birhanu Taffesse, Additional Collector Jitender Reddy, TGSRTC Executive Directors Venkanna and Sridhar, DEO S. Yadaiah, HCSC Secretary General C. Shekhar Reddy తదితరులు పాల్గొన్నారు.
Every Student Must Reach Home Safely: V.C. Sajjanar’s Clear Message to Schools
