Tuesday, July 28, 2026
HomeCinemaగ్రాండ్‌గా ప్రారంభమైన రామ్ పోతినేని డ్రీమ్ ప్రాజెక్ట్ #RAPO23

గ్రాండ్‌గా ప్రారంభమైన రామ్ పోతినేని డ్రీమ్ ప్రాజెక్ట్ #RAPO23

గ్రాండ్‌గా ప్రారంభమైన రామ్ పోతినేని డ్రీమ్ ప్రాజెక్ట్ #RAPO23 ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న #RAPO23 చిత్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా తన మనసులో రూపుదిద్దుకున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌తో రామ్ దర్శకుడిగా కూడా అరంగేట్రం చేస్తున్నారు. కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్తగా స్థాపించిన రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇది రామ్ కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపొందుతున్న చిత్రంగా నిలవనుంది. […]

గ్రాండ్‌గా ప్రారంభమైన రామ్ పోతినేని డ్రీమ్ ప్రాజెక్ట్ #RAPO23

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న #RAPO23 చిత్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా తన మనసులో రూపుదిద్దుకున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌తో రామ్ దర్శకుడిగా కూడా అరంగేట్రం చేస్తున్నారు. కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్తగా స్థాపించిన రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇది రామ్ కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపొందుతున్న చిత్రంగా నిలవనుంది.

ఈ రోజు సంప్రదాయ పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ఘనంగా ప్రారంభించారు. నిర్మాత కృష్ణ పోతినేని చిత్ర కథా స్క్రిప్ట్‌ను రామ్ పోతినేనికి అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత పి. మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, పీవీ రవికిషోర్ క్లాప్ కొట్టారు. దర్శకుడిగా తన ప్రయాణానికి శ్రీకారం చుడుతూ తొలి షాట్‌ను స్వయంగా రామ్ పోతినేని డైరెక్ట్ చేశారు.

ఇదే రోజున హైదరాబాద్ శివార్లలో రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. హీరోగా రామ్ పోతినేని షూటింగ్‌లో పాల్గొంటుండగా, చిత్రంలోని ప్రధాన తారాగణం కూడా ఈ షెడ్యూల్‌లో భాగమవుతోంది.

#RAPO23 చిత్రానికి ప్రత్యేకత ఏమిటంటే… ఈ కథను స్వయంగా రామ్ పోతినేనియే రచించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో, సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా, నియో-నోయర్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటివరకు చూడని వినూత్న అనుభూతిని అందించనుంది. భావోద్వేగాలతో పాటు ఉత్కంఠభరితమైన కథనం, శక్తివంతమైన పాత్రలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Ram-Pothinenis-Dream-Project-RAPO23-Launched-Grandly
Ram-Pothinenis-Dream-Project-RAPO23

దర్శకత్వం, కథా రచనతో పాటు హీరోగా కూడా రామ్ పోతినేని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన చిత్రంగా మారింది. తన కలల ప్రాజెక్ట్‌ను అత్యున్నత స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన ఎంతో శ్రద్ధగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం పలువురు ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తున్నారు. పూర్తి తారాగణానికి సంబంధించిన అధికారిక ప్రకటనలను త్వరలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

సాంకేతిక విభాగంలోనూ ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ తిరునావుకరసు (తిర్రు) విజువల్స్‌ను అద్భుతంగా ఆవిష్కరించనుండగా, ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హైన్ హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ భారీ సెట్లను నిర్మిస్తూ సినిమాకు గ్రాండ్ విజువల్ లుక్‌ను తీసుకురానున్నారు.

విభిన్నమైన కథ, భారీ నిర్మాణ విలువలు, అత్యుత్తమ సాంకేతిక నిపుణులు, త్వరలో ప్రకటించనున్న స్టార్ క్యాస్ట్‌తో #RAPO23 ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పింది. రామ్ పోతినేని కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచే ఈ చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు ఓ సరికొత్త సినీ అనుభూతిని అందించనుంది.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories