Thursday, March 26, 2026
HomeLatestAIతో వ్యవసాయానికి నూతన దిశ – KLHలో అంతర్జాతీయ సమ్మర్ స్కూల్

AIతో వ్యవసాయానికి నూతన దిశ – KLHలో అంతర్జాతీయ సమ్మర్ స్కూల్

హైదరాబాద్, మార్చి 23, 2026: కేఎల్‌హెచ్ అజీజ్‌నగర్ క్యాంపస్‌లో “భారత వ్యవసాయానికి ఎస్ఏఆర్, మెషిన్ లెర్నింగ్ వినియోగం” అనే అంశంపై ఐట్రిపుల్ ఈ జిఆర్ఎస్ఎస్ సమ్మర్ స్కూల్ 2026 ఘనంగా ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతోంది. మార్చి 23 నుంచి 26 వరకు జరుగుతున్న ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి పరిశోధకులు, అకాడెమిషియన్లు, పరిశ్రమ నిపుణులు, విద్యార్థులు భారీగా పాల్గొంటున్నారు.Thank you for reading this post, don't forget to subscribe! ఈ […]

హైదరాబాద్, మార్చి 23, 2026: కేఎల్‌హెచ్ అజీజ్‌నగర్ క్యాంపస్‌లో “భారత వ్యవసాయానికి ఎస్ఏఆర్, మెషిన్ లెర్నింగ్ వినియోగం” అనే అంశంపై ఐట్రిపుల్ ఈ జిఆర్ఎస్ఎస్ సమ్మర్ స్కూల్ 2026 ఘనంగా ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతోంది. మార్చి 23 నుంచి 26 వరకు జరుగుతున్న ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి పరిశోధకులు, అకాడెమిషియన్లు, పరిశ్రమ నిపుణులు, విద్యార్థులు భారీగా పాల్గొంటున్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!

ఈ కార్యక్రమాన్ని కేఎల్‌హెచ్ ఐఈఈఈ విద్యార్థి విభాగం, జిఆర్ఎస్ఎస్ చాప్టర్, ఐఈఈఈ జియోసైన్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సమ్మర్ స్కూల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జియోసైన్స్, రిమోట్ సెన్సింగ్, సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR) వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి.

ఈ సందర్భంగా అంతర్జాతీయ నిపుణులు డా. పాల్ రోసెన్, డా. కుమార్ విజయ్ మిశ్రా, ప్రొఫెసర్ అలెజెండ్రో సీ. ఫెర్రీ పాల్గొని కీలక ఉపన్యాసాలు ఇచ్చారు. దేశీయంగా డా. ఆర్. శ్రీనివాస్, విజేందర్ బి. రెడ్డి, నరేందర్ రావు బి. వంటి ప్రముఖులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా ఎన్ఆర్ఐసి–ఇస్రో ఆధ్వర్యంలో “స్పేస్ ఆన్ వీల్స్” ప్రదర్శన ఏర్పాటు చేయగా, ఉపగ్రహ నమూనాలు, అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎస్ఏఆర్ డేటా, మెషిన్ లెర్నింగ్ వినియోగంతో పంటల పర్యవేక్షణ, నేల తేమ అంచనా, దిగుబడి అంచనాలు, వాతావరణ మార్పులకు అనుగుణ వ్యవసాయంపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు.

హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్స్, కేస్ స్టడీస్ ద్వారా విద్యార్థులు ప్రత్యక్ష డేటాతో పనిచేసే అవకాశాన్ని పొందారు. ఆధునిక జియోస్పేషియల్ టూల్స్ వినియోగంపై లోతైన అవగాహన పెంపొందింది.

ఈ సందర్భంగా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు కోనేరు లక్ష్మణ్ హవీష్ మాట్లాడుతూ, “సాంకేతికత వ్యవసాయ రంగాన్ని పూర్తిగా మార్చుతోంది. ఇలాంటి కార్యక్రమాలు యువతను నూతన ఆవిష్కరణలకు ప్రేరేపిస్తాయి” అని పేర్కొన్నారు.

కన్వీనర్ డాక్టర్ ముసామి అజయ్ చౌరాసియా ఆధ్వర్యంలో, ప్రిన్సిపాల్ డా. ఏ రామకృష్ణ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సమ్మర్ స్కూల్ ద్వారా పాల్గొన్నవారు అంతర్జాతీయ అనుభవం, విస్తృత జ్ఞానంతో కొత్త ఉత్సాహాన్ని పొందారు.

Global Experts Gather at KLH to Explore AI & SAR Technologies for Smart Farming

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories