Thursday, May 28, 2026
HomeCinemaపెద్ది గేమ్ గ్లింప్స్ మార్చి 27న రిలీజ్ – రామ్ చరణ్ క్షేమం, షూటింగ్ రీస్టార్ట్

పెద్ది గేమ్ గ్లింప్స్ మార్చి 27న రిలీజ్ – రామ్ చరణ్ క్షేమం, షూటింగ్ రీస్టార్ట్

‘పెద్ది’ గేమ్ గ్లింప్స్ మార్చి 27న రిలీజ్ – రామ్ చరణ్ క్షేమం, షూటింగ్ రీస్టార్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రస్తుతం భారీ అంచనాల మధ్య సిద్ధమవుతోంది. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పెద్ది ఫస్ట్ షాట్‌కు ప్రేక్షకుల నుంచి […]

‘పెద్ది’ గేమ్ గ్లింప్స్ మార్చి 27న రిలీజ్ – రామ్ చరణ్ క్షేమం, షూటింగ్ రీస్టార్ట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రస్తుతం భారీ అంచనాల మధ్య సిద్ధమవుతోంది. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇప్పటికే విడుదలైన పెద్ది ఫస్ట్ షాట్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ అందించిన పాటలు కూడా చార్ట్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా చికిరి చికిరి, రై రై రా రా పాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తాజాగా చిత్రబృందం మరో బిగ్ అప్డేట్‌ను ప్రకటించింది. ‘పెద్ది’ గేమ్ గ్లింప్స్ ను మార్చి 27 ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ గ్లింప్స్ మాస్ ర్యాంపేజ్‌గా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు.

ఇక షూటింగ్ సమయంలో రామ్ చరణ్ గాయపడ్డారన్న వార్తలపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. సెట్స్‌లో జరిగిన చిన్న ఘటనలో రామ్ చరణ్ ఎడమ కంటికి స్వల్ప గాయం కావడంతో ఒక చిన్న ప్రొసీజర్ నిర్వహించారని, ప్రస్తుతం ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నారని తెలిపారు. రేపటి నుంచి మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారని, చిత్రీకరణ షెడ్యూల్‌కు ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. సినిమా పనులు సజావుగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు, ఎడిటర్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా వంటి టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

భారీ అంచనాల మధ్య వస్తున్న ‘పెద్ది’ ఈ సమ్మర్ సీజన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories