గాయపడ్డ సింహం’ మెమొరబుల్ హిట్ కావాలి: నారా రోహిత్
వైవిధ్యమైన ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్-డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో శ్రీ విష్ణు ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా, ఫారియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు.
పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ్ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప్, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
నారా రోహిత్ మాట్లాడుతూ…
“‘గాయపడ్డ సింహం’ టీమ్‌కి హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించి, అందరికీ మెమొరబుల్ ఫిల్మ్ కావాలని కోరుకుంటున్నాను. విజయ్, పవన్ కోసం ఈ వేడుకకు వచ్చాను. ఈ బ్యానర్‌లోనే నా తదుపరి సినిమా ఉండటం ఆనందంగా ఉంది. మే 1న అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి. పైరసీని ప్రోత్సహించకండి.”
శ్రీ విష్ణు మాట్లాడుతూ…
“ఈ సినిమాలో నా క్యామియో పాత్రకు యూనిక్ టైమింగ్ ఉంటుంది. కశ్యప్ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది, దాన్ని సినిమాలో బాగా ఉపయోగించారు. జేడీ గారితో పని చేయడం గౌరవంగా ఉంది. పవన్ సాదినేని, నిర్మాతలతో ఉన్న ఫ్రెండ్షిప్ వల్లే ఈ సినిమా చేశాను. ఆడియన్స్‌ను ఖచ్చితంగా అలరిస్తుంది.”
జేడీ చక్రవర్తి మాట్లాడుతూ…
“ఈ సినిమాకు అసలైన హీరో పవన్ సాదినేని. ప్రారంభంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా, టీమ్ కలిసి సినిమాను పూర్తి చేసింది. ఇందులో హాస్యంతో పాటు విభిన్నమైన కాన్సెప్ట్ ఉంది. శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది.”
డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ మాట్లాడుతూ…
“ఈ సినిమా నా టీమ్ కృషి ఫలితం. పవన్ సాదినేని నాకు పెద్ద సపోర్ట్. ప్రతి టెక్నీషియన్ తమ బెస్ట్ ఇచ్చారు. స్వీకర్ అగస్తి మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ సినిమా నాకు మంచి స్నేహితులను ఇచ్చింది. ఆడియన్స్‌కు కొత్త అనుభవం ఇస్తుందని నమ్ముతున్నాను.”
ఫారియా అబ్దుల్లా మాట్లాడుతూ…
“ఈ సినిమాలో నాకు చాలా ఎంజాయబుల్ పాత్ర దక్కింది. కశ్యప్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అద్భుతం. ఆడియన్స్ ఆశించిన దానికంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమా ఇస్తుంది.”
మానస చౌదరి మాట్లాడుతూ…
“ఈ సినిమాలో ప్రతి సీన్ ఫన్‌తో నిండిపోయి ఉంటుంది. తరుణ్ భాస్కర్, జేడీ గార్లతో కలిసి పని చేయడం మంచి అనుభవం. ప్రేక్షకులు నవ్వుకుంటూ థియేటర్ నుంచి బయటకు వస్తారు.”
మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్తి మాట్లాడుతూ…
“ఇలాంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. కశ్యప్ గారి కాన్ఫిడెన్స్ వల్లే మంచి అవుట్‌పుట్ ఇవ్వగలిగాను. ఈ సినిమా మ్యూజిక్ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది.”
ఇతర దర్శకుల అభిప్రాయాలు…
శ్రీరామ్ ఆదిత్య, సాయి మార్తాండ, హుస్సేన్ షా కిరణ్, హసిత్ గోలి, సందీప్ రాజ్ తదితరులు కశ్యప్ శ్రీనివాస్ ప్రతిభపై నమ్మకం వ్యక్తం చేస్తూ, ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాతల మాటల్లో…
నిర్మాతలు ఈ సినిమా ఫ్రెండ్షిప్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో రూపొందిందని తెలిపారు. ప్రేక్షకులు రెండు గంటల పాటు అన్ని టెన్షన్స్ మరిచి నవ్వుకునేలా సినిమా ఉంటుందని చెప్పారు.
