Tuesday, June 2, 2026
HomeLatestHyderabad: దేశం గర్వించదగ్గ మహానేత NTR, సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad: దేశం గర్వించదగ్గ మహానేత NTR, సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad: ఎన్.టి. రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని ఆయనను దేశం గర్వించదగ్గ మహానేతగా కొనియాడారు. తెలుగుజాతి అన్నగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో స్ఫూర్తిదాయక నాయకులుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్‌లను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సీఎం అన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించి పేదలకు ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్‌ను ముందుగా గుర్తు చేసుకోవాలని, భూ సంస్కరణల […]

Hyderabad: ఎన్.టి. రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని ఆయనను దేశం గర్వించదగ్గ మహానేతగా కొనియాడారు. తెలుగుజాతి అన్నగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో స్ఫూర్తిదాయక నాయకులుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్‌లను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సీఎం అన్నారు.

భారత రాజ్యాంగాన్ని రచించి పేదలకు ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్‌ను ముందుగా గుర్తు చేసుకోవాలని, భూ సంస్కరణల ద్వారా పేదలకు హక్కులు కల్పించిన ఇందిరా గాంధీని తలచుకోవాలని, నీతి, నిజాయితీ, ఉక్కు సంకల్పంతో ప్రజల మనసులు గెలుచుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. మానవ మనుగడ ఉన్నంతకాలం ఈ ముగ్గురు జాతిరత్నాలను స్మరించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన తాను ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై కొందరు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్న సీఎం, ఎన్టీఆర్ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జాతి గర్వించదగ్గ నాయకుడని అన్నారు. ఇది కేవలం ఒక విగ్రహావిష్కరణ మాత్రమే కాకుండా రాజకీయాలకు అతీతమైన స్ఫూర్తికి గుర్తుగా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకమని చెప్పారు.

తెలంగాణకు తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు వంటి ఎన్నో నాయకులను అందించిన ఘనత ఎన్టీఆర్‌దేనని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కూడా రాజకీయ నాయకుడిగా గుర్తించిన వ్యక్తి ఎన్టీఆర్‌నేనని వ్యాఖ్యానించారు. ఆయన పేరు పెట్టుకుని తిరిగేవారే ఇప్పుడు విగ్రహావిష్కరణను విమర్శించడం విచారకరమని అన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల వెనుక కూడా అన్నగారి స్ఫూర్తి ఉందని సీఎం తెలిపారు. రూ.2 కిలో బియ్యం పథకం నుంచి సన్నబియ్యం పంపిణీ వరకు ఎన్టీఆర్ ఆలోచనల ప్రభావం కనిపిస్తోందన్నారు. ఆడబిడ్డలకు చీరలు, సంక్షేమ పథకాలు, బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో ఆయన పాత్ర మరువలేనిదని చెప్పారు. పటేల్-పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేదలకు ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించిన ఘనత కూడా ఎన్టీఆర్‌దేనన్నారు.

తమ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో ఇందిరమ్మ, ఎన్టీఆర్ స్ఫూర్తి కనిపిస్తోందని సీఎం తెలిపారు. “ఇందిరమ్మ ఒక తరం అయితే.. ఎన్టీఆర్ ఒక శకం” అని వ్యాఖ్యానించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతును రాజుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 65 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మహిళల సంక్షేమం కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ప్రజల సహకారంతో ప్రజాపాలన కొనసాగుతుందని, 2034 వరకు ప్రజా ప్రభుత్వానిదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, 30 వేల ఎకరాల్లో “భారత్ ఫ్యూచర్ సిటీ”ని నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలను అక్కడికి తీసుకువచ్చి యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories