Tuesday, June 2, 2026
HomeHyderabadHyderabad: మహిళను వేధించిన కేసులో ఐదుగురు నిందితులకు 7 రోజుల జైలు శిక్ష

Hyderabad: మహిళను వేధించిన కేసులో ఐదుగురు నిందితులకు 7 రోజుల జైలు శిక్ష

Hyderabad: నగరంలోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను వేధించిన కేసులో పోలీసులు వేగంగా స్పందించి ఐదుగురు నిందితులకు కోర్టు ద్వారా 7 రోజుల జైలు శిక్ష పడేలా చేశారు. మహిళల భద్రత విషయంలో రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. ఈ ఘటన 27 మే 2026 సాయంత్రం నిజాం కాలేజ్ పీజీ హాస్టల్ సమీపంలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఐదుగురు వ్యక్తులు, భర్తతో కలిసి బైక్‌పై […]

Hyderabad: నగరంలోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను వేధించిన కేసులో పోలీసులు వేగంగా స్పందించి ఐదుగురు నిందితులకు కోర్టు ద్వారా 7 రోజుల జైలు శిక్ష పడేలా చేశారు. మహిళల భద్రత విషయంలో రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు మరోసారి స్పష్టం చేశారు.

ఈ ఘటన 27 మే 2026 సాయంత్రం నిజాం కాలేజ్ పీజీ హాస్టల్ సమీపంలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఐదుగురు వ్యక్తులు, భర్తతో కలిసి బైక్‌పై వెళ్తున్న మహిళను వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించగా, అబిడ్స్ పోలీసులు తక్షణమే స్పందించి ఈ-పెట్టీ కేసులు నమోదు చేశారు.

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వేగంగా విచారణ పూర్తి చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్‌లో ఉన్న గౌరవనీయ III స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ ఎం. భాస్కర్ విచారించారు. నిందితులపై ఆరోపణలు రుజువుకావడంతో సీపీ యాక్ట్ సెక్షన్లు 70(A), 70(C) కింద ఐదుగురికి ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

శిక్ష పడిన నిందితులు నేపాల్‌కు చెందిన కేటరింగ్ కార్మికులుగా గుర్తించారు. వీరు ప్రస్తుతం కింగ్ కోఠి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నిందితులుగా సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్‌లను పోలీసులు పేర్కొన్నారు.

ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన అబిడ్స్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, కోర్టు పీసీ రాజేశ్వర్‌తో పాటు సీడీఓ బృందాన్ని అబిడ్స్ ఎస్‌హెచ్‌వో కె. పరశురామ్ అభినందించారు. మహిళల భద్రతకు భంగం కలిగించే వారిపై భవిష్యత్తులోనూ కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories