Komaram Bheem Asifabad: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో భారీ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి A. Revanth Reddy శ్రీకారం చుట్టారు. Kagaznagarలో నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతి బాట” బహిరంగ సభలో పాల్గొన్న సీఎం, జిల్లాలో రూ.112.14 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజల సంక్షేమం, గిరిజనుల ఆత్మగౌరవం, రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రూ.56.55 కోట్లతో నిర్మించిన Koutala 132/33 KV Sub Stationను ప్రారంభించారు. అలాగే Chintalamanepalli, Gudlabori, Kapuwada, Chintakunta, Ankushapur ప్రాంతాల్లో కొత్త 33/11 KV Sub Stationsకు శంకుస్థాపనలు చేశారు. Rebbena మండలంలోని Nambala గ్రామంలో రూ.6 కోట్లతో 2MW Solar Power Plantకు శంకుస్థాపన చేశారు. Asifabad, Kagaznagar మున్సిపాలిటీల్లో రూ.33 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టారు.
సభలో ప్రసంగించిన సీఎం Revanth Reddy, “ఆదిలాబాద్‌లో గిరిజన, ఆదివాసీ బిడ్డలు ఆత్మగౌరవంతో తలెత్తుకునే పరిస్థితులు రావాలి. గూడేల్లో ఒక్క గుడిసె కూడా కనిపించకూడదు” అని అన్నారు. పేదలకు పక్కా ఇండ్లు ఇవ్వాలని గిరిజనులు కోరడంతో వెంటనే స్పందించి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, ITDA ప్రాంతాల్లో అదనంగా 21 వేల ఇండ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి అర్హ కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటికే లక్ష ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు జరిగాయని, సెప్టెంబర్ 17, 2026 నాటికి మరో లక్ష ఇండ్లకు గృహప్రవేశాలు నిర్వహించాలని మంత్రి Ponguleti Srinivas Reddyని ఆదేశించినట్లు తెలిపారు. రెండో విడతలో మరో 2.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా Tummidihetti Project అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. “Kaleshwaram కట్టినా ఆదిలాబాద్ జిల్లాకు ఒక్క ఎకరాకు కూడా నీరు రాలేదు. అందుకే Tummidihetti వద్ద ప్రాజెక్టు నిర్మించి రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించాం” అని తెలిపారు. ఇందుకోసం Maharashtra ముఖ్యమంత్రికి లేఖ రాసినా స్పందన రాలేదని విమర్శించారు. రైతుల ప్రయోజనాల కోసం అవసరమైతే ఎవరినైనా కలుస్తానని, కేంద్ర మంత్రి Kishan Reddy మధ్యవర్తిగా వ్యవహరించాలని కోరారు.
ధాన్యం కొనుగోలు అంశంపై కూడా సీఎం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 75 లక్షల క్వింటాళ్ల వరిధాన్యాన్ని సేకరించిందని, కానీ కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడంలో ముందుకు రావడం లేదని ఆరోపించారు. “తడిసిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది. రైతులు అధైర్యపడొద్దు” అని భరోసా ఇచ్చారు.
జూన్ 15లోపు కేంద్రం స్పందించకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించిన సీఎం, “రైతుల కోసం మోదీ అయినా, Kishan Reddy అయినా ఎవరినీ లెక్కచేయను. రైతు ప్రయోజనాలే నాకు ముఖ్యం” అని స్పష్టం చేశారు. సభలో భారీ సంఖ్యలో ప్రజలు, రైతులు, గిరిజనులు పాల్గొన్నారు.
