Saturday, June 6, 2026
HomeLatest“తెలంగాణ నా గుండెల్లో ఉంది”.. ప్రాంతీయ విద్వేషాలపై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

“తెలంగాణ నా గుండెల్లో ఉంది”.. ప్రాంతీయ విద్వేషాలపై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు అనుమతి నిరాకరణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు. ఇకపై తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయంగా చురుకుగా పనిచేస్తుందని, వచ్చే GHMC ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బలంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, […]

హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు అనుమతి నిరాకరణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు. ఇకపై తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయంగా చురుకుగా పనిచేస్తుందని, వచ్చే GHMC ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బలంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, “తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు దేశ సమగ్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయి. అందుకే ఇక్కడ జనసేన అవసరం ఉందని భావిస్తున్నాం” అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు మాత్రమే పార్టీని విస్తరిస్తామని గతంలో చెప్పామని, ఇప్పుడు ఆ సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.

ప్రతి సమస్యపై మాట్లాడతామని, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటామని పేర్కొన్న పవన్ కళ్యాణ్, “నా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం” అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని, రాష్ట్ర విభజనను అవమానకరంగా నిర్వహించిన విధానాన్నే అప్పట్లో ప్రశ్నించామని తెలిపారు. పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని ప్రకటించడం తెలంగాణ ఉద్యమానికి తగిన గౌరవం కాదని అన్నారు.

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లాభాలు పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారని పవన్ ఆరోపించారు. “ప్రతి సమస్యకూ ఆంధ్ర ప్రజలను కారణంగా చూపించడం సరైంది కాదు. నాయకులు తప్పు చేస్తే వారిని ప్రశ్నించాలి కానీ ప్రజల మధ్య ద్వేషం పెంచకూడదు” అని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య కృత్రిమంగా దూరం పెంచే రాజకీయాలను తీవ్రంగా ఖండించారు.

తనకు తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆదిలాబాద్ తండాల్లో తిరిగి బోర్లు వేయించిన విషయాన్ని, తెలంగాణ యువత పోరాటాలకు తాను మద్దతుగా నిలిచిన సందర్భాలను ప్రస్తావించారు. “జనసేన పార్టీ ఈ గడ్డ మీదే పుట్టింది. తెలంగాణ సమాజ ఆవేదనల నుంచే మా పార్టీ సిద్ధాంతాలు రూపుదిద్దుకున్నాయి” అని అన్నారు.

కొంతమంది రాజకీయ నాయకులు, విశ్లేషకులు తనపై ప్రాంతీయ దాడులు చేస్తున్నారని ఆరోపించిన పవన్ కళ్యాణ్, “తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలు ఇతర రాష్ట్రాల్లో పార్టీలు విస్తరించవచ్చని, కానీ తాను తెలంగాణకు రావద్దనడం ద్వంద్వ వైఖరి అని విమర్శించారు.

కేంద్ర హోంమంత్రి Amit Shah పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సమాధానం చెప్పకూడదా అని ప్రశ్నించిన పవన్, దేశ సమగ్రతకు ప్రాంతీయ విద్వేషాలు ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని హెచ్చరించారు. “ప్రతి రాష్ట్రానికి వెళ్లేందుకు పాస్‌పోర్ట్ అవసరం లేదు. ఇది నా దేశం” అంటూ వ్యాఖ్యానించారు.

తనపై వచ్చిన చెరువు కబ్జా ఆరోపణలపైనా పవన్ స్పందించారు. ప్రభుత్వం సర్వే చేసి తప్పు జరిగిందని తేలితే భూమిని స్వచ్ఛందంగా అప్పగిస్తానని ప్రకటించారు. ఆ స్థలంలో కేవలం గోశాల మాత్రమే ఉందని, ఎలాంటి అక్రమం జరగలేదని స్పష్టం చేశారు.

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కలిపే రహదారికి మాజీ ముఖ్యమంత్రి Burgula Ramakrishna Rao పేరు పెట్టాలని తన ఆకాంక్షను వెల్లడించిన పవన్ కళ్యాణ్, ప్రజా గాయకుడు Gaddar విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో జనసేన పార్టీ ప్రజా సమస్యలపై బలమైన పోరాటం చేస్తుందని, ప్రజలను మభ్యపెట్టకుండా నేరుగా సమస్యలపై మాట్లాడుతుందని తెలిపారు.

“Telangana Is in My Heart” – Pawan Fires at Regional Hatred Politics

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories